సుభాష్ : ఏడాదిలో సినిమాల్లోకి పవన్..అండర్‌గ్రౌండ్‌లోకి జనసేన ..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి సరిగ్గా ఏడాది. ఈ ఏడాదిలో అన్ని రాజకీయ పార్టీల్లోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అధికార పార్టీగా వైసీపీ.. పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. దారుణమైన ఓటమి ఎదురైనప్పటికీ.. టీడీపీ పోరాడే ప్రయత్నం చేస్తోంది. అయితే.. ఆ ఎన్నికల్లో మరో ప్రధాన ప్లేయర్‌గా రేసులో నిలబడిన జనసేన మాత్రం.. ఈ ఏడాదిలో .. అండర్ గ్రౌండ్‌కి వెళ్లిపోయింది. ఒక్కటంటే.. ఒక్క మేజర్ ప్రోగ్రాం చేపట్టలేదు.. ప్రజల కోసం నిలబడి ఉంటామనే భావన కూడా కల్పించలేదు.. కనీసం కల్పించడానికి ప్రయత్నించలేదు కూడా.

ఏడాదిలో జనసేన ఆచూకీ మిస్..!

అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు నిరాశజనక ఫలితాలు వచ్చాయి. ఓ రకంగా కోలుకోలేని షాకే. ఆరు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. స్వయంగా పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి.. రెండు చోట్ల ఓడిపోయారు. ఒక్కరంటే.. ఒక్క ఎమ్మెల్యే గెలిచారు. ఆయనా .. పవన్ కల్యాణ్ స్వయంగా ఓడిపోవడంతో… తోక జాడించేశారు. పవన్ గెలవలేదు.. నన్ను గెలిపించడం ఏమిటని ఆయన చెలరేగిపోయారు. పవన్ కల్యాణ్ గెలవలేకపోవడంతోనే… జనసేన శ్రేణుల స్థైర్యం నీరుగారిపోయింది. పవన్ ను ప్రేమిస్తాం.. జగన్ కు ఓటేస్తామని.. వైసీపీకి చెందిన సానుభూతిపరులు వ్యూహాత్మకంగా చేసిన ప్రచారంతో.. పవన్ కల్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా.. వైసీపీకి ఓటేశారు. పవన్ కల్యాణ్ అనుభవ రాహిత్యం.. ఎన్నికలను ఎదుర్కొన్న దృక్కోణం సరిగ్గా లేకపోవడంతో ఈ పరాజయం ఎదురైంది. విశ్లేషించుకోవడానికి పలు సమావేశాలు నిర్వహించారు… కానీ… తప్పెక్కడ జరిగింది..? దాన్ని దిద్దుకోవడానికి ఏం చేయాలి..? ఏం చేస్తున్నారు..? కార్యచరణ ఏంటి అన్నదానిపై మాత్రం క్లారిటీ లేకుండా పోయింది.

చిన్న చిన్న తాయిలాలకే జనసేన నేతల జంప్..!

ఓ వైపు పరాజయ భారం.. మరో వైపు పవన్ కల్యాణ్… పార్టీ నడపడంలో తడబడుతూండటంతో.. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఒక్కొక్కరు గుడ్ బై చెప్పడం ప్రారంభించారు. నిజానికి ఎన్నికల ఫలితాలు రాక ముందే.. విజయ్ బాబు.. అద్దేపల్లి శ్రీధర్ లాంటి వారు గుడ్ బై చెప్పి.. ఇతర పార్టీల్లో చేరిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత రావెల కిషోర్ నుంచి చాలా మంది వెళ్లిపోయారు. వారిలో నియోజకవర్గాల్లో పోటీ చేసిన వారు కూడా ఉన్నారు. వెళ్లేవాళ్లని బుజ్జగించి ఆపడం పవన్ కల్యాణ్ విధానం కాదు.. కానీ.. చాలా మందికి జనసేన యాక్టివ్‌గా ఉంటే. .ఆ పార్టీలోనే ఉండాలని ఉంటుంది. అలాంటి యాక్టివ్ నెస్ లేకపోవడంతో… అధికార పార్టీ నేతలు చిన్న చిన్న పదవులు ఆశ పెట్టినా.. వెళ్లిపోతున్నారు. వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం జనసేన అగ్రనేతలుగా చెలామణి అయ్యే వారు కానీ.. పవన్ కల్యామ్ చేయలేదు.

ప్రజాపోరాటాలకు ఎన్నో అవకాశాలు.. జనసేన వినియోగించుకున్నది ఎన్ని..?

ఈ ఏడాది కాలంలో ప్రజా సమస్యలు బోలెడన్ని వచ్చాయి. ప్రజల కోసం పోరాడి.. వారి కోసం నిలబడితే.. బేస్ దొరికేది. మొదట ఇసుక సమస్య.. ఆ తర్వాత రాజధాని సమస్య.. ఆ తర్వాత కరోనా.. ఆ తర్వాత ఎల్జీ పాలిమర్స్.. ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రభుత్వం ప్రతిపక్షాలకు ఎప్పుడూ ఖాళీగా ఉంచే ప్రయత్నం చేయలేదు. కానీ.. జనసేన మాత్రం వాటిని ఉపయోగించుకోవడంలో వెనుకబడింది. ఇసుక సమస్య కోసం.. విశాఖలో కవాతు నిర్వహించారు.. ఆ తర్వాత సైలెంటయ్యారు. అమరావతిపై మాదే లీడింగ్ ఉద్యమం అన్నారు.. బీజేపీతో పొత్తు పెట్టుకుని సైలెంటయిపోయారు. ఇలా చెప్పుకుంటూ..పోతే..జనసేన పార్టీ ఏడాదిలో చేసిన వ్యూహాత్మక తప్పిదాలు.. ఆ పార్టీకి మైనస్‌గా మారాయి.

పవన్ సినిమాల్లోకి వెళ్లడంతో పార్ట్ టైమ్ పార్టీగా మారినట్లే..!

పవన్ కల్యాణ్ సినిమాల్లోకి వెళ్లిపోవడం… పార్టీ కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్‌లకు.. ట్విట్టర్‌కు పరిమితం చేయడంతో.. చాలా పెద్ద గ్యాప్ వచ్చేసింది. సమస్యలపై స్పందిస్తూ.. ఓ ప్రెస్ నోట్ విడుదల చేయడం.. కామన్ అయిపోయింది. దీన్ని సామాన్యులు కూడా సీరియస్‌గా తీసుకునే పరిస్థితి లేదు. పవన్ కల్యాణ్ సినిమాల్లోకి వెళ్లడంతో.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ లాంటి బ్రాండ్ వాల్యూ ఉన్న నేతలు కూడా గుడ్ బై చెప్పారు. దాంతో పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఇప్పుడు జనసేన నేతలు.. అప్పుడప్పుడు మీడియాలో కనిపిస్తూంటారు. పవన్ కల్యాణ్ ప్రకటనలు విడుదల చేస్తూంటారు. అంతే.. ఇక.. జనసేన కార్యక్రమాలే ఎక్కడా కనిపించడం లేదు.

బీజేపీతో పొత్తుతో మొదటికే మోసం..!

సోయి ఉన్న రాజకీయ నాయకుడు ఎవరైనా దగ్గర్లో ఎన్నికలు లేకపోతే.. పొత్తుల గురించి మాట్లాడరు. పొత్తులు అసలే పెట్టుకున్నారు. పవన్ కల్యాణ్‌కు ఆ సోయి లేదు కాబట్టి.. దగ్గర్లో ఎన్నికలు లేకపోయినా… హడావుడిగా పోయి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. స్థానిక ఎన్నికల్ోల కలిసి పోటీ చేశారో.. లేదో వాళ్లకే తెలియదు. జనసేన నేతలు.. వారికి బలం ఉన్న చోట టీడీపీతో కలిసిపోయారు. బీజేపీ నేతలు బలం ఉన్న చోట.. వారికి వారు పోటీ చేసేశారు. వారి మధ్య సమన్వయం కాదు కదా.. ఇప్పుడు పొత్తులు కూడా ఉన్నాయని వారు అనుకోవడం లేదు. విడివిడిగా అభిప్రాయాలు వ్యక్తం చేసుకుంటున్నారు. మొత్తానికి పొత్తు లక్ష్యం ఏమిటో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మొదటికే మోసం వచ్చింది. ఏడాదిలో జనసేన… అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోయింది. ఇక నుంచైనా జనంలోకి వస్తే.. సీరియస్‌గా తీసుకుంటారు .. లేకపోతే.. పార్ట్ టైమ్ పార్టీగా ప్రజలు లైట్ తీసుకుంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close