బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిన ప్ర‌భాస్ సినిమా

ప్ర‌భాస్ – నాగ అశ్విన్ కాంబోలో వైజ‌యంతీ మూవీస్ ఓ చిత్రాన్ని నిర్మించ‌నుంది. దాదాపు 250 కోట్ల సినిమా ఇది. ప్ర‌స్తుతం స్క్రిప్టు ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈలోగా బాలీవుడ్‌లో ఈ సినిమా హాట్ టాపిక్‌గా మారింది. బాహుబ‌లి త‌ర‌వాత‌.. ప్ర‌భాస్ అక్క‌డ కూడా ఓ స్టార్ అయిపోయాడు. సాహో కూడా హిందీలో బాగానే ఆడింది. అందుకే ప్ర‌భాస్ త‌దుప‌రి సినిమాపై అక్క‌డ ఫోక‌స్ పెరిగింది. రాధాకృష్ణ సినిమా బాలీవుడ్‌ని క‌దిలించ‌లేదు గానీ, నాగ అశ్విన్ ప్రాజెక్టు మాత్రం బాలీవుడ్ దృష్టిని ఆక‌ర్షించింది. ఈ సినిమా కోసం ఓ బాలీవుడ్ స్టార్ క‌థానాయిక‌ని ఎంచుకుంటార‌ని గ‌ట్టిగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అలియాభ‌ట్‌, క‌త్రినా.. ఇలా చాలా పేర్లు పరిశీల‌న‌లోకి వ‌స్తున్నాయి. అక్క‌డి నుంచి మ‌రింత మంది తారాగ‌ణాన్ని దిగుమతి చేసుకునే అవ‌కాశం ఉంది. ఈ సినిమాతో టై- అప్ అవ్వాల‌ని ఓ ప్ర‌ముఖ బాలీవుడ్ సంస్థ గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తోంద‌ని స‌మాచారం. వైజయంతీ మూవీస్ కూడా అందుకు సిద్ధంగానే ఉంది. అన్నీ కుదిరితే.. త్వ‌ర‌లోనే ఇందుకు సంబంధించిన ఓ అధికారిక ప్ర‌క‌ట‌న వైజయంతీ మూవీస్ జారీ చేసే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close