మహాకూటమిని విమర్శించే నైతిక హక్కు బీజేపీకి ఉందా?

బిహార్ ఎన్నికలలో బీజేపీ ఘోర పరాజయం గురించి తెదేపా-బీజేపీ నేతలు చాలా జాగ్రత్తగా ఆచితూచి స్పందిస్తున్నారు. ఈ మధ్యనే మళ్ళీ ఏక్టివ్ అయిన బీజేపీ నేత కన్నా లక్ష్మి నారాయణ దీనిపై స్పందిస్తూ “బిహార్ లో అనైతిక పొత్తుల వలననే మహాకూటమి విజయం సాధించగలిగిందని, కానీ గత ఎన్నికలతో పోల్చి చూస్తే రాష్ట్రంలో బీజేపీకి సుమారు 10 శాతం ఓట్లు పెరిగాయని అన్నారు. సాధారణంగా ఎన్నికలలో ఓడిపోయినా ఏ పార్టీ అయినా చెప్పే మాటలనే కన్నా లక్ష్మి నారాయణ కూడా చెప్పారు.

ఎన్నికలలో నైతికం…అనైతికం అని మోడీతో సహా ఎవరూ చుట్టూ గిరిగీసుకొని కూర్చోరు. ఉదాహరణకి మహా కూటమికి ఇంతకు ముందు నాయకత్వం వహించిన ములాయం సింగ్ దాని నుంచి బయటపడటానికి ప్రధాన కారణం బీజేపీయేనని వార్తలు వచ్చేయి. మహాకూటమి నుండి ములాయం సింగ్ ని విడగొడితే అది చెల్లాచెదురయిపోతుందని బీజేపీ ఆశించింది. బీజేపీ ఆశించినట్లే ములాయం సింగ్ మహాకూటమి నుంచి బయటకు రప్పించగలిగింది. కానీ అది ఊహించినట్లు మహాకూటమి విచ్చినం కాలేదు. పైగా మరింతబలపడి ఎన్నికలలో ఘన విజయం సాధించింది. మరి బీజేపీ చేసిన ఈ పని నైతికమో…అనైతికమో కన్నా లక్ష్మి నారాయణ నోటితో చెపితే వినసొంపుగా ఉంటుంది.

సుమారు ఏడాదిన్నర క్రితం సార్వత్రిక ఎన్నికలలో ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు వంటి అనేక హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం, ఆ హామీలలో కొన్నిటిపై ‘యూ టర్న్’ తీసుకోవడం, ఇంతవరకు ఆర్ధిక ప్యాకేజి మంజూరు చేయకపోవడం నైతికమో..కాదో కన్నా లక్ష్మి నారాయణ చెపితే బాగుంటుంది. రాజకీయ పార్టీలు చెప్పే నైతిక విలువలు కేవలం ప్రసంగాలకే పరిమితం తప్ప ఆచరణలో కనబడటం లేదు. కాంగ్రెస్ పార్టీని అవినీతి పార్టీ అని ఎద్దేవా చేస్తున్న బీజేపీలోకి కాంగ్రెస్ పార్టీలో నుంచే కన్నా, కావూరి, పురందేశ్వరి వంటివారు అనేకమంది చేరారు. ఇటీవల అస్సాంలో ఏకంగా 9మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకొంది. బీజేపీలో చేరిన నేతలు ఇప్పుడు మహా కూటమిని దానితో జత కట్టిన కాంగ్రెస్ పార్టీది అనైతిక పొత్తులని విమర్శిస్తున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకొని బీజేపీ పరిస్థితి బాగోకపోతే, మళ్ళీ వాళ్ళు అందరూ కాంగ్రెస్ పార్టీలోకి తిరుగు ప్రయాణం అవడం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close