ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపుదిద్దుకొన్న చిత్రం జనతా గ్యారేజ్. సమంత, నిత్యమీనన్ కథానాయికలు. సెప్టెంబరు 1న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కొద్ది సేపటి క్రితం సెన్సార్ కూడా పూర్తయ్యింది. ఈ చిత్రానికి U/A
సర్టిఫికెట్ మంజూరు చేసింది సెన్సార్ బోర్డు. నిడివి 2.35 నిమిషాలు వచ్చిందని సమాచారం. సెన్సార్ బోర్డు రిపోర్ట్ చూస్తే… సినిమాకి పాజిటీవ్ ఫలితం వచ్చేట్టు కనిపిస్తోంది. ఎన్టీఆర్ కొత్తగా కనిపిస్తున్నాడని, ఈ సినిమాతో మరో హిట్ కొట్టడం ఖాయమని ఓ సెన్సార్ బోర్డు మెంబర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి తీపి కబురులాంటి వార్త చెప్పాడు. సెప్టెంబరు 2న విడుదల కావల్సిన ఉన్న ఈ సినిమా.. అనివార్య కారణాల వల్ల ఒక రోజు ముందే వచ్చేస్తోంది. ఒకరోజు ప్రీ పోన్డ్ అవ్వడం వల్ల.. సెన్సార్ కూడా ముందే చేయాల్సివచ్చింది. నిజానికి శనివారం సెన్సార్ కావాల్సింది. కానీ.. ఒక రోజు ముందే సెన్సార్ పూర్తి చేశారు. సెన్సార్ బోర్డు పాజిటీవ్ టాక్ తో… చిత్రబృందంలో ఆనందం వెల్లివిరుస్తోంది. శనివారం నుంచి పబ్లిసిటీ మొదలెట్టనున్నారు. ప్రచారం కోసం ఎన్టీఆర్ కేరళ కూడా వెళ్లబోతున్నాడని టాక్. విడుదల ముందు ఆడియో సక్సెస్ మీట్ నిర్వహించే సన్నాహాల్లో ఉంది చిత్రబృందం.
