పిపిఎ సమీక్షల ఎఫెక్ట్..! జగన్‌పై ఫైరయిన జపాన్..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న రద్దు, సమీక్షల నిర్ణయాలకు అంతర్జాతీయంగా అభిమానులు పెరిగిపోతున్నారు. కేంద్రం ఎంత చెప్పినా వినకుండా.. పీపీఏలను రద్దు చేసే లక్ష్యంతో.. ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. ఈ క్రమంలో… సంప్రదాయేతర విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టిన.. విదేశీ సంస్థలన్నీ… రగిలిపోతున్నాయి. ఓ వైపు.. వివిధ దేశాల రాయబారుల్ని పిలిపించి.. పెట్టుబడులు పెట్టమని జగన్ … సదస్సులు పెడుతూంటే.. మరో వైపు అదే దేశాల నుంచి… తీవ్రమైన నిరసన లేఖలు.. అటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి వస్తున్నాయి. పీపీఏల్లో పెట్టుబడుల విషయంలో…గతంలో.. ఫ్రాన్స్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తూ..కేంద్రానికి లేఖ రాశాయి. తాజాగా… జపాన్ నుంచి.. ఇలాంటి లేఖలు అటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి అందాయి.

విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పునఃసమీక్షపై జపాన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్రం, ఏపీ ప్రభుత్వాలకు దౌత్య కార్యాలయం లేఖ రాసింది. పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడులపై పునఃసమీక్ష ప్రభావం చూపుతుందని జపాన్ హెచ్చరించింది. ఏపీలోని పీపీఏల్లో జపాన్‌ పారిశ్రామికవేత్తలు కూడా పెట్టుబడులు పెట్టారని .. ఒకసారి ఖరారైన ఒప్పందాలపై… పునఃసమీక్షలను ఫ్రాన్స్‌, దక్షిణాఫ్రికా, యూరప్‌ దేశాలు గమనిస్తున్నాయని జపాన్ హెచ్చరించారు. జపాన్‌కు చెందిన కంపెనీలు ఎస్‌బీ ఎనర్జీ, రెన్యూ కంపెనీల ఏపీలో సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయి. పీపీఏలపై కేంద్రం హెచ్చరికలు రాసినా… ఏపీ సర్కార్ మాత్రం.. రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. దీనిపై పవర్ ట్రిబ్యునల్ లో విచారణ జరుగుతోంది.

మరో వైపు.. పోలవరం ప్రాజెక్ట్ గేట్ల కాంట్రాక్ట్ ఫ్రాన్స్ కు చెందిన బెకం కంపెనీ చేస్తోంది. ఆ కంపెనీని మధ్యలోనే వెళ్లిపోవాలని ఏపీ సర్కార్ ఆదేశించింది. దీనిపై ఫ్రాన్స్ నుంచి లేఖలు అందినట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వివిధ దేశాల నుంచి…. ప్రత్యేకమైన గుర్తింపును ఎప్పటికప్పుడు తెచ్చుకుంటున్నారు. కానీ.. అది ఆయన కోరుకుంటున్న పెట్టుబడుల దారిలో మాత్రం లేరు.. వేరుగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close