వాళ్లని బీజేపీలోకి పంపుతోంది టీడీపీ అధ్యక్షుడేనట..!

తెలంగాణలో భారతీయ జనతా పార్టీలోకి మిగిలిన టీడీపీ నేతలంతా క్యూ కట్టబోతున్నారు. ఇప్పటికే.. చాలా మంది తమ నిర్ణయాలను ప్రకటించారు. ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్ లాంటి చోట్ల.. టీడీపీ నేతలు ఇంకా మిగిలి ఉన్నారు. ప్రజల్లో ఇంతో ఇంతో పలుకుబడి ఉన్న వారు కావడం… చంద్రబాబు.. తెలంగాణ తెలుగుదేశం పార్టీపై ఏ మాత్రం దృష్టి పెట్టే ఉద్దేశంలో లేకపోవడంతో… చాలా మంది బీజేపీ గూటికి చేరుతున్నారు. కాంగ్రెస్ పరిస్థితి అయోమయంలో ఉండటం.. టీఆర్ఎస్ కిక్కిరిసిపోవడంతో…. ఆశలు ఉన్న పార్టీగా బీజేపీనే వారికి కనిపిస్తోంది. రేవతి చౌదరి, బండ్రు శోభారాణి, ఖమ్మం జిల్లాలో కోనేరు కుటుంబం, నల్లగొండ జిల్లాలో మిగిలిన ఇతర నేతలూ అదే బాటలో ఉన్నారు. ఇలా.. టీడీపీ నేతలంతా.. వరుస పెట్టి.. బీజేపీలో చేరడం టీఆర్ఎస్‌కు అనుమానం కలిగించింది. వెంటనే.. తలసాని రంగంలోకి దిగిపోయారు.

టీడీపీ నుంచి వచ్చి చేరుతుతున్న ఔట్ డేటెడ్ క్యాండేట్స్ చేరికతో బీజేపీకి ఒరిగేదేమీలేదని తలసాని తేల్చేశారు. క్యాడర్ లేకుండా పార్టీలో నాయకులు చేరినంత మాత్రాన పార్టీ బలపడదన్నారు. బీజేపీలో టీడీపీ నేతలు చేరడం వెనుక చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. ఇప్పటికే బీజేపీలో చేరిన గరికపాటి మోహన్ రావు.. టీడీపీ నేతలందర్నీ బీజేపీలో చేరేలా మొబిలైజ్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. గరికపాటి .. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఈ కారణంగానే తలసాని…టీడీపీ నేతల్ని చంద్రబాబే… బీజేపీలోకి పంపుతున్నారని..కుట్ర కోణాన్ని ఆవిష్కరించారు. తలసాని కోణం ఏమిటంటే… కాంగ్రెస్‌కు ఉన్నంత ఓటు బ్యాంక్‌… బీజేపీకి లేదని చెప్పుకొస్తున్నారు. బీజేపీని తక్కువ చేసే ప్రయత్నంలో.. కాంగ్రెస్‌ను పెద్దగా చూపేందుకు కూడా తలసాని వెనుకాడలేదు. అంటే.. టీఆర్ఎస్ కు.. ఇప్పుడు కాంగ్రెస్ కన్నా.. బీజేపీనే ముప్పుగా భావించడం ప్రారంభమైందంటున్నారు.

అమిత్ షా త్వరలో తెలంగాణ పర్యనటకు రాబోతున్నారు. ఆ సమయంలో.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని.. విలీనం చేసుకుంటున్నంతగా హడావుడి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలందర్నీ గురి పెట్టారు. ఇలా.. టీడీపీ మద్దతుదారులు… బీజేపీ వైపు మళ్లితే.. తమ ఓటు బ్యాంకుకు గండి పడుతుందన్నది… టీఆర్ఎస్ నేతల ఆందోళనగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close