ఇంత వరదల్లోనూ చంద్రబాబు ఇల్లే మంత్రులకు సమస్య..!?

కృష్ణానదికి గత పదేళ్లలో ఎన్నడూ లేనంత వరదలు రావడంతో.. అధికార పార్టీ నేతలకు…చంద్రబాబు నివాసమే అతి పెద్ద సమస్యగా కనిపిస్తోంది. చంద్రబాబు నివాసం టార్గెట్‌గా వైసీపీ నేతలు విమర్శలు ప్రారంభించారు. ఉద్ధృతంగా వస్తున్న వరదతో.. కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నివాసంలోకి నీళ్లు వచ్చాయని… ఇసుక మేటలు వేసిందని.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రకటించారు. ఇంట్లోకి వరద నీరు రావడంతోనే చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారని.. విమర్శించారు. సీఎం జగన్ చెప్పినా… రాజకీయ కోణంలో అల్లరి చేశారని.. ఇప్పుడు ఇల్లు వదిలి పారిపోయిందెవరో తెలుసుకోవాలని వెల్లంపల్లి వెటకారమాడారు. అయితే..కరకట్టపై చంద్రబాబు ఇంట్లోకి… వరద నీరు వచ్చిందని అధికారులు నిర్ధారించలేదు. కానీ.. పై నుంచి భారీ వరద వస్తున్నందున.. ముందస్తు హెచ్చరికలు మాత్రం జారీ చేశారు.

కరకట్ట మీద… నదీ పరివాహక ప్రాంతం మీద నివాసం ఉంటున్న వారందరికీ ముందు జాగ్రత్త హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబు ఇంట్లో వరద వచ్చి ఇసుక మేటలు వేశాయని.. మంత్రి ప్రకటించడంతో.. టీడీపీ నేతలు.. డ్రోన్ కెమెరాలతో.. అన్ని కోణాల్లో ఫోటోలు తీసి.. మీడియాకు విడుదల చేశారు. కనీసం హెలిప్యాడ్ వద్దకు కూడా.. నీరు చేరలేదని.. టీడీపీ నేతలు చెబుతున్నారు. కరకట్ట వద్ద కృష్ణా నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ.. వరద ఇంట్లోకి వచ్చే స్థాయిలో లేదన్నారు. కృష్ణానది ఉద్ధృతంగా ప్రవహిస్తూండటంతో.. కరకట్ట కు సమీపంగా ఇళ్లు ఉన్న వారు.. ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో టీడీపీ నేతలు… ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. లక్షల క్యూసెక్కుల్లో నీరు వస్తుందని.. తెలిసినా..ప్రకాశం బ్యారేజ్ వద్ద కుట్ర పూరితంగానే… నీటి నిర్వహణ చేపట్టలేదని మండిపడ్డారు. బ్యారేజీలో ఉన్న నీటిని కిందకు వదలకపోవడంతో.. లక్షల క్యూసెక్కుల్లో.. సాగర్, పులిచిందల నుంచి నీరు వస్తూండటంతో.. కృష్ణా పరివాహక ప్రాంతంలో… లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కేవలం చంద్రబాబు ఉంటున్న ఇంట్లోకి నీరు తెప్పించి.. ఆనందపడటానికి బ్యారేజీ నీటిని దిగువకు వదలకుండా… పేదల ఇళ్లను ముంచేశారని.. టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

ప్రస్తుతం విజయవాడ కరకట్టపై సముద్రమట్టానికి 19 మీటర్ల ఎత్తులో చంద్రబాబు ఇల్లు ఉంది. ప్రస్తుతం సముద్రమట్టానికి 17.4 మీటర్ల ఎత్తులో కృష్ణా ప్రవాహం ఉంది. ప్రస్తుత ప్రవాహంతో పోలిస్తే.. 5.2 అడుగుల ఎత్తులో చంద్రబాబు ఇల్లు ఉంది. ప్రసుతం ప్రకాశం బ్యారేజీ వద్ద 6 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది…ఇది 8 లక్షల క్యూసెక్కులకు పెరిగితేనే… చంద్రబాబు నివాసానికి సమానంగా.. నది ప్రవాహం ఉంటుంది. ఈ మట్టానికి తీసుకురావడానికే… బ్యారేజీ నుంచి నీటిని పూర్తి స్థాయిలో విడుదల చేయడం లేదని.. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండ‌లు పెంచుతున్న‌ నాగ‌శౌర్య

ల‌వర్ బోయ్ పాత్ర‌ల‌కు అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతాడు నాగశౌర్య‌. త‌న కెరీర్‌లో అలాంటి క‌థ‌లే ఎక్కువ విజ‌యాల్ని అందించాయి. అయితే... మాస్ హీరోగా నిరూపించుకోవాల‌న్న‌ది నాగ‌శౌర్య తాప‌త్ర‌యం. అలాంటి క‌థ‌లు ఎంచుకుంటున్నా - స‌రైన...

‘పుష్ష‌’‌పై విజ‌య్‌ సేతుప‌తి క్లారిటీ

అల్లు అర్జున్ - సుకుమార్‌ల హ్యాట్రిక్ సినిమా 'పుష్ష‌'. ఈ సినిమా కోసం విజ‌య్ సేతుప‌తిని విల‌న్ గా ఎంచుకున్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల విజ‌య్ ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నాడు. ఆ...

వ‌ర్మ‌ని లైట్ తీసుకున్నాడా?

రాంగోపాల్ వ‌ర్మ పేల్చ‌బోతున్న బాంబు `ప‌వ‌ర్ స్టార్‌`. ఓటీటీ వేదిక‌గా వ‌ర్మ ఇది వ‌ర‌కు ప‌లు సినిమాల్ని వ‌దిలాడు. దేనికీ రాని క్రేజు.. `ప‌వ‌ర్ స్టార్‌`కి వ‌చ్చింది. ఈ సినిమా స్పెషాలిటీ గురించి...

రాజకీయాల్లో రాజస్థాన్ “సచిన్” హిట్ వికెట్ ..!?

రాజస్థాన్ ప్రభుత్వాన్ని మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కూల్చేసినట్లుగా కూల్చేస్తారని భావించిన సచిన్ పైలట్.. చివరికి.. హిట్ వికెట్‌గా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తన వైపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఆయన తనకు...

HOT NEWS

[X] Close
[X] Close