హర్యానాలో ఆగని విద్వంసం, 6మంది మృతి

హర్యానాలో జాట్ సామజిక వర్గానికి చెందిన ప్రజలు తమను బీసీలలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ గత నాలుగు రోజులుగా చేస్తున్న ఉద్యమం హింసాత్మకంగా మారి అది నానాటికీ మరింత ఉదృతమవుతోంది. ఈ ఉద్యమంలో ఇంతవరకు ఆరుగురు మరణించారు. కోట్లాది రూపాయల విలువగల ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు బుగ్గిపాలయ్యాయి. పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పడంతో రోహ్తక్, భివానీ, జజ్జర్, హిస్సార్, సోనిపట్, గోహన పట్టణాలలో గత రెండు రోజులుగా కర్ఫ్యూ విదించారు. అయినా ఆందోళనకారులు విద్వంసం సృష్టిస్తూనే ఉన్నారు. నిన్న రాత్రి భివాని జిల్లాలోని లోహరు అనే పట్టణంలో ఆందోళనకారులు ఒక ఏటిఎంకి నిప్పు పెట్టారు. పక్కనే ఉన్న ఒక కోపరేటివ్ బ్యాంకులోకి ప్రవేశించి ఫర్నీచర్, ఫైల్స్ కి కూడా నిప్పు పెట్టారు. ఇంతవరకు ఆందోళనకారులు  7 రైల్వే స్టేషన్లకు నిప్పు పెట్టారు.

కర్ఫ్యూ విదించబడిన పట్టణాలలో పారా మిలటరీ దళాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి, అడుగడునా గస్తీ కాస్తున్నప్పటికీ ఆందోళనకారులు ఎక్కడో అక్కడ చెలరేగిపోతూనే ఉన్నారు. పరిస్తితులు పూర్తిగా అదుపు తప్పడంతో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ కేంద్రం నుండి అదనపు బలగాలను పంపవలసిందిగా కోరారు. ఇప్పటికే హర్యానాలో 15 రిసర్వ్ బెటాలియన్ కంపెనీలు, 3 పారా మిలటరీ కంపెనీలు, రెండు ఆర్మీ బృందాలు, రాష్ట్రా సాయుధ పోలీస్ బలగాలు మొహరించబడి ఉన్నాయి. వాటికి అదనంగా కేంద్రం మరికొన్ని కంపెనీల పారా మిలటరీ దళాలను హర్యానాకు పంపించుతోంది.

ఈ ఆందోళన కారణంగా సుమారు 800 రైళ్ళ రాకపోకలు నిలిచిపోయాయి. వాటిలో కొన్నిటిని వేరే మార్గం గుండా పంపిస్తుంటే మరికొన్నిటిని రద్దు చేయవలసి వచ్చింది. ఆ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వేకి కూడా చాలా భారీ నష్టం కలుగుతోంది. ఇక ఆందోళనకారులు రాష్ట్రం గుండా సాగే జాతీయ రహదారులను, రోడ్డు మార్గాలన్నిటినీ ఎక్కడికక్కడ దిగ్బంధించడంతో వందలాది బస్సులు, సరుకు రవాణా వాహానాలు రోడ్లపైనే నిలిచి పోయాయి. ఆ కారణంగా హర్యానాకి పొరుగునే ఉన్న డిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు చేరవలసిన సరుకులు చేరడం లేదు. అలాగే ఆ ప్రాంతాల నుండి హర్యానా మీదుగా వెళ్ళవలసిన ఇతర రాష్ట్రాలకు సరుకు రవాణా కూడా నిలిచిపోయింది.

జాట్ లకు రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని, కనుక ఆందోళన విరమించి చర్చలకు రావలసిందిగా ఆందోళనకారులకు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ చేసిన విజ్ఞప్తిని వారు పట్టించుకోకపోవడంతో విద్వంసం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో, ఇంకా ఎంత ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ వాతావరణ శాఖ

వేసవిలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న హైదరాబాద్ ప్రజలకు కాస్త ఊరట లభించింది. శనివారం ఉదయం నుంచి నగరంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రతి రోజూ వడగాడ్పులతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close