మంచు కుర్రాడు ‘ర్యాంబో’గా మారాడు

డిఫరెంట్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిన మంచు మనోజ్ కాస్త తన పంథా మార్చుకుని కమర్షియల్ సినిమాల వైపు అడుగులేస్తున్నట్టు ప్రస్తుత పరిస్థితులు వ్యక్తం చేస్తున్నాయి. దీనికి మంచి ఉదాహరణ మనోజ్ శౌర్య సినిమాలో నటించడమే.. ఎప్పుడు విలక్షణతతో కూడిన ప్రయోగాలను చేసే ఈ మంచు వారబ్బాయి శౌర్య లాంటి క్లాస్ సినిమా చేయడం ఎవరు ఊహించి ఉండరు.. అయితే సినిమా క్లాస్ అయినా తనకి కావాల్సిన యాక్షన్ అంశాలు దానిలో కూడా ఉండేలా చూసుకున్నాడు మనోజ్.

ప్రస్తుతం తను తీస్తున్న సినిమా రిలీజ్ అవుతుండగా తన తర్వాత సినిమా కన్ఫాం చేశాడు. టాలీవుడ్ యాక్షన్ స్టార్ గా అభిమానులను సంపాధించిన మనోజ్ ఇప్పుడు ఆ యాక్షన్ టైటిల్ ర్యాంబోగానే రాబోతున్నాడు. అవును మనోజ్ తర్వాత సినిమా టైటిల్ ‘ర్యాంబో’. కొత్తవారికి అవకాశం ఇవ్వడంలో ముందుండే మనోజ్ ఈ సినిమాతో కూడా సాగర్ పలసాల అనే నూతన దర్శకుడిని పరిచయం చేస్తున్నాడు.

రమేష్ పుప్పాల నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో మొదలవనుంది. కరెంట్ తీగ తర్వాత పెళ్లి హడావిడిలో గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఇకనుండి స్పీడ్ మీద సినిమాలను తీయనున్నాడు. ప్రస్తుతం తను నటించిన శౌర్య సినిమా మార్చ్ 4న రిలీజ్ కు సిద్ధమయ్యింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో మాయం..కారణం అదేనా..?

ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమవ్వడం చర్చనీయాంశం అవుతోంది....

రేవంత్ కు నోటీసులు అంతా తూచ్..!!

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు విషయంలో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విషయంలో ఢిల్లీ పోలిసుల నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులే అందలేదు....

ఈవెంట్ కంపెనీ నిర్వాకం.. నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పులు

ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ అని చెప్పుకొనే ఓ సంస్థ చేసిన నిర్వాకం వ‌ల్ల‌, నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పులు మొద‌ల‌య్యాయి. పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అస‌లు మేట‌ర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close