కేఏ పాల్, ఆర్జీవీ, నాదెండ్ల పాపులారిటీ సేమ్..! దానికేమైనా విలువుందా.. ?

బాలకృష్ణ ఎవరో తెలియదు అని కొద్ది రోజుల కిందట కేఏ పాల్ అనే పెద్ద మనిషి.. ఓ టీవీ చానల్ లో కూర్చుని అన్నారు. దాన్ని సూపర్ కామెడీగా నెటిజన్లు భావించారు. దాన్ని లక్షల మంది చూశారు. అదంతా పాపులారిటీ అయిపోతుందా..? కానీ కేఏ పాల్ లాంటి వాళ్లు అనుకుంటూ ఉంటారు. అనుకోవడమే కాదు.. నిజంగా చెప్పారు కూడా. కేఏ పాల్ భాషలో చెప్పాలంటే మిలియన్ల మింది చూశారు. అప్పటికి పవన్ కల్యాణ్ ధవళేశ్వరం పై చేసిన కవాతును.. ఇచ్చిన ప్రసంగాన్ని ఐదారు లక్షల మంది చూస్తే.. తన వీడియోను కోటి యాభై లక్షల మంది చూశారట. చూశారా.. పవన్ కల్యాణ్ కంటే తనకు ఎంతో ఎక్కువ క్రేజ్ ఉందని ఆయన టీవీ చానళ్ల వేదికగా సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు..? పవన్ కల్యాణ్ కంటే… కేఏ పాల్ కే ఎక్కువ క్రేజ్ ఉందని అంగీకరిద్దామా..?

సోషల్ మీడియా లెక్క చూస్తే పవన్ కన్నా.. కేఏ పాల్ వంద రెట్లు సూపర్ స్టార్ కాదా..?

ఇలాంటివి… రామ్ గోపాల్ వర్మ చేస్తూంటారు. సహజంగా.. సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేది నెగెటివిటీనే. ఆర్జీవీ లాంటి వాళ్లకు అదే ముడి సరుకు. ఎవరి మీద ఏదో ఓ రాయి వేసి తాను ప్రచారం పొంది.. ఎదుటి వాళ్ల పాపులారిటీని దెబ్బతీయాలనుకుంటున్నారు. కొన్నాళ్ల క్రితం వరకూ.. మెగా హీరోలు… ఆయనకు సాఫ్ట్ టార్గెట్. వాళ్ల పరువు ఎంత తీయాలో అంత తీశారు. ఆ తర్వాత ఎవరు పడితే వాళ్ల మీద పడుతున్నారు. ఇప్పుడాయనకు… ఎన్టీఆర్ కనిపించారు. అందులో తప్పేమీ లేదు. అది ఆయన నైజం. గతంలో… మెగా ఫ్యామిలీ మీద ఆయన విరుచుకుపడినప్పుడు… ఇతర హీరోల ఫ్యాన్స్ ఆయనకు అనుకూలంగా మాట్లాడి ఉండవచ్చు. అలాగే ఇప్పుడు ఆయన ఎన్టీఆర్ మీద వాగుతున్నాడు కాబట్టి.. ఇతర హీరోల ఫ్యాన్స్ మద్దతు పలుకుతారు. అంతిమంగా ఆయన అందర్నీ వాడుకుంటున్నాడు తప్ప… మరో విశేషం లేదు. రేపు అవసరం అయితే… ఇప్పుడు విమర్శించినంతగా… ఆయన పొగుడుతాడు కూడా. ఆయన క్యారెక్టర్ అంతే. ఆయన మాటల్ని పట్టుకుని ఇప్పుడు.. ఎన్టీఆర్ పైనో.. ఆయన జీవితంపైన తీసిన బయోపిక్ పైనో… ఉమ్మి వేయాలనుకుంటే.. అది వచ్చి.. ఊసినోళ్లమీదే పడుతుంది.

నాదెండ్లను బండబూతులు తిడితే వైరల్ కాదా..?

ఇక నాదెండ్ల భాస్కర్ రావు. ఆయన చరిత్ర… కొత్త తరానికి తెలియనిదేమీ కాదు కానీ.. ఓ యూట్యూబ్ … సోషల్ మీడియా తరానికి మాత్రం తెలియదు. అందుకే ఆయన ఓ యూ ట్యూబ్ చానల్ కు ఇంటర్యూ ఇచ్చి… తాను ముదిమి వయసులో ఉన్నానన్న సంగతిని కూడా మర్చిపోయారు. సిగ్గూశరం ఉన్న వ్యక్తిని అనే సంగతిని మర్చిపోయి.. భూమి మీద లేని వ్యక్తిపై… ఇష్టం వచ్చినట్లు నిందలు వేసి.. శునకానందం పొందాడు. ఆయన అలా చెప్పాడని.. యూట్యూబ్ లో లక్షల వ్యూస్ వస్తున్నాయని.. ఆర్జీవీ ట్వీట్ చేయడం… ఎన్టీఆర్ బయోపిక్ కన్నా.. . అదే పాపులర్ అయిందని ఆయన చెప్పడం… అది నిజమేనన్నట్లుగా.. కొంత మంది కథనాలు రాసుకోవడం చూస్తే… ఓ వ్యక్తిపైనో.. ఓ వర్గంపైనో.. వ్యతిరేకత… తో… మంచెదో చెడు ఏదో .. తెలుసుకోలేనంత.. దారుమమైన దుస్థితికి దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ప్రముఖుడ్ని తిట్టి ప్రముఖులైపోవడమే నేటి ట్రెండ్..!

సోషల్ మీడియాలో యుగంలో పబ్లిసిటీ కోసం.. ప్రముఖులపై… లేదా… సమాజాంలో.. ఆరాధ్యులుగా ఉన్న వారిపై నిందలేయడం.. ఇప్పుడు ప్యాషన్ గా మారిపోయింది. తమకు వచ్చే పేరు ప్రఖ్యాతులతో ఎంతో కొంత సంపాదించుకోవచ్చన్న ఉద్దేశంతో.. ఇలా చేస్తున్నారో.. రాజకీఉద్దేశాలు ఉన్నాయో కానీ.. ఈ భూమి మీద మహానీయులుగా ఉన్న వారిపైనా.. నిందలేస్తున్నారు. చివరికి ఆ దేవదేవుడ్ని కూడా వదిలి పెట్టరు. రేపోమాపో నిందలేస్తారు. అప్పుడు.. ఆ దేవదేవుడికి దర్శనానికి వెళ్లే భక్తుల కన్నా… యూట్యూబ్ లో ఆయన పై చేసిన వ్యతిరేక కామెంట్లకే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.. వైరల్ అయ్యాయి కాబట్టి.. అవే నిజం.. దేవుడి కన్నా.. ఆ కామెంట్లు చేసినోడే గొప్ప అనే పరిస్థితి వచ్చినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదు. అంతా కలికాలం..!

——-సుభాష్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్టీఆర్‌ను వైసీపీ స్మరించుకుంది.. చంద్రబాబును తిట్టడానికైనా సరే!

ఎన్టీఆర్ అందరి మనిషి. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సహజంగానేకొంత మందికి దూరంఅవుతారు. అలా దూరమైన వారు కూడా ప్రత్యేక సందర్భాల్లో దగ్గర చేసుకోక తప్పదు. ఎన్టీఆర్‌ను అలా దగ్గర చేసుకోవాల్సిన ప...

బాలయ్య కోసం కొత్త ప్ర‌పంచం సృష్టిస్తాడ‌ట‌

అ, క‌ల్కి, జాంబిరెడ్డి చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఇప్పుడు హను-మాన్ రూపొందిస్తున్నాడు. తేజా స‌జ్జా క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల కాబోతోంది. ఈలోగా నంద‌మూరి బాల‌కృష్ణ‌తో సినిమా చేసే...

అందరికీ బెంచ్ మార్క్ బిల్డింగ్‌లు – ఏపీ జనానికి మాత్రం బటన్లు !

తెలంగాణ ప్రభుత్వం ఓ పెద్ద సెక్రటేరియట్ కట్టుకుంది. కథలు కథలుగా చెప్పుకున్నారు. ఇప్పుడు కేంద్రం పార్లమెంట్ నిర్మించింది.. అంత కంటే ఎక్కువ కథలు చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ రెండు నిర్మాణాలూ అవసరం లేదని..దుబారా...

కడప వాసుల్లో సునీత పోరాటానికి పెరుగుతున్న మద్దతు !

రాజకీయాల్లో భయ పెట్టి అందర్నీ తమ వెనుక నడిపించుకోవడం కన్నా...సానుభూతి అనేది ఎక్కువ బలమైనది. ప్రజల సానుభూతి పొందితే వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కడప జిల్లాలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close