చక్కనమ్మ చిక్కినా అందమే..!

లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు సిని పరిశ్రమలో అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. చరణ్, అల్లు అర్జున్, తారక్, మహేష్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలందరితోనూ జతకట్టి ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది ఈ చందమామ. సినిమా పరిశ్రమలో ఎవరికి ఎప్పుడు బ్యాడ్ టైమ్ మొదలవుతుందో చెప్పలేం. కొంతకాలంగా లావెక్కిన ఈ సుందరి కెరియర్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది అనుకున్నారు.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ తో బ్రహ్మోత్సవం, పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో సర్ధార్ గబ్బర్ సింగ్ లో నటిస్తున్న అమ్మడు మరోసారి ఫుల్ బిజీ కానుంది. అంతేకాదు తమిళంలో కూడా రెండు, మూడు సినిమా అవకాశాలను కూడా చేజిక్కించుకుంది. అయితే తనకు అవకాశాలు లావెక్కడం వల్ల రావట్లేదా ఏంటి అని అనుకుందేమో డైట్ పాటించి.. ఎక్సర్ సైజ్ లు గట్రా చేసి జీరో సైజ్ షేప్ ని తెప్పించుకుంది. తగ్గిందని మనల్ని నమ్మించాలని అనుకుందో ఏమో తన సైజ్ జీరో నడుముతో ఓ ఫోటో షూట్ ఇచ్చింది.

మరి అమ్మడు ఇప్పటి లుక్ చూసి అదుర్స్ అనేలా ఉంది. మరోసారి చందమామ సినిమాలో కాజల్ ను చూసినట్టు ఉందనుకోండి.. ప్రస్తుతం చేతిలో ఉన్న రెండు భారీ చిత్రాల్లో ఒకటి బ్లాక్ బస్టర్ అయినా ఈ ముద్దుగుమ్మ మళ్లీ అవకాశాల వెళ్లువ మొదలైనట్టే.. మరి సొగసైన అందాలతో మెరుపులు చిందిస్తున్న కాజల్ కు ఇకనుండైనా లక్ కలిసి రావాలని ఆశిద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close