సన్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్

Telakapalli-Raviఇప్పుడు ఏపి, తెలంగాణ రాష్ట్రాలలో జరుగుతున్నా చర్చ ఇదే. అల్లు అర్జున్ సినిమాలో లాగా ఎవరు మంచి కుమారుడు?
ముఖ్యంగా హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల సమరం మొదలయ్యాక ఈ చర్చ పోలిక మరీ ఎక్కువయ్యాయి.

కెసిఆర్ కుమారుడు కేటీఅర్ ఈ ఎన్నికల పోరాట నాయకత్వం చేపట్టిన తర్వాత ఈ చర్చ పెరిగింది. చంద్రబాబు నాయుడు కుమారుడుగా చక్రం తిప్పుతున్న లోకేష్ ను కేటిర్ ను పోల్చి చూస్తున్నారు. కేటిర్ ముందునుంచి మంత్రిగా పార్టీ నాయకుడుగా ప్రతక్ష్య పాత్ర పోషిస్తుండగా లోకేష్ తెర వెనుక ప్రధాన పాత్ర నిర్వహించేవారు. అయితే చంద్రబాబు అధికారం చేబట్టిన తర్వాత లోకేష్ నేరుగానే జోక్యం చేసుకోవడం పెరిగింది. మరీ సీనియర్లు మినహా మంత్రులు అధికారులు కూడా ఆయననుంచి ఆదేశాలు సలహాలు తెసుకోవడం తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో అయన సన్నిహితుడైన అభీష్ట ప్రత్యేక కార్యదర్శిగా చాల కీలక పాత్ర వహించారు. టిడిపి ని కుదిపేసిన వోటుకు నోటు వివాదంలో ఈ బృందం తీవ్ర విమర్శకు గురైంది. బాబు కొన్ని దశాబ్దాలుగా కూడపెట్టుకున్న ప్రతిష్ట దెబ్బ తినిపోవడానికి ఇది దారితీసిందనే భావం నెలకొంది. ఫలితంగా బాబు హైదరాబాద్ నుంచి తరలింపును వేగవంతం చేయడమే గాక కెసిఆర్ తో కొంత తగ్గి వ్యవహరించాల్సి వచ్చిందనేది అందరి భావన. వరంగల్ లోను జిహెచ్ఎంసి ఎన్నికల్లోనూ అయన చొరవ చూపడానికి కూడా ఇది అవరోధమైంది. దీనికి తోడూ విజయవాడ కాల్ మనీ కేసులోను లోకేష్ చేరదీసినవారే చిక్కుల్లో పడ్డారు. వీటి తర్వాత అభీష్ట ను తప్పించారు. జిహెచ్ఎంసి ఎన్నికల నాయకత్వ బాధ్యత ఇప్పటికి లోకేష్ కే ఉన్న అంత ఊపు లేని పరిస్తితి. బాబు తో ఒక పెద్ద సభ పెడతామన్నప్పటికి ప్రస్తుతానికి హైకోర్టు ఆదేశాల తర్వాత అదీ వాయిదా పడింది. తాము చాల చోట్ల గెలుస్తామని టిడిపి చెపుతున్నా ఇతరులు గట్టిగా తీసుకోవడం లేదు. నిజంగా ఆ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తే లోకేష్ పట్టు పెరుగుతుంది. బాగా దెబ్బ తింటే కొంత ఇబ్బందిలో పడక తప్పదు. ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితుడైన సిఎం కుమారుడిగా అయన స్థానానికి వెంటనే వచ్చిన చిక్కు లేదు గాని కొంత సర్దుబాటు జరగాల్సి వస్తుంది. దీనికి తోడూ నిధులు సమకూర్చడం కోసం ప్రభుత్వ పథకాల కాంట్రాక్టర్ల నుంచి వనరులు రాబట్టడంలో అయన మంత్రులను కూడా ఖాతరు చేయడంలేదనే ఆరోపణ ఉంది. ఇవన్నీ ఎలా పరిణమిస్తాయో చూడాలి.

ఇక కేటీఅర్ తండ్రి అసీస్సులతోనే మొదటినుంచి అధికారగణం మద్దతు అధికంగా పొందుతున్నారనే విమర్శా ఉంది. మరీ ముఖ్యంగా హరీష్ రావు అనుయాయులు ఈ విషయంలో కొంత గుర్రుగా ఉన్నారు. సిఎం ఎప్పుడు కుమారున్నే ముందుకు తెస్తున్నందువల్ల హరీష్ తన స్థానం ప్రాధన్యత కాపాడుకోవడానికి శ్రమ పడవలసి వస్తున్నది. అయితే కీలకమైన పనులు ఇప్పటికి కెసిఆర్ ఆయనకే అప్పగిస్తారని వారంటారు. సిఎం తరువాత బలమైన నేత హరీష్ అనడంలో సందేహం లేదంటారు వాళ్ళు. కానీ పనిగట్టుకొని ఎప్పుడూ కేటీఅర్ నే ముందుకు నేడుతుంటే తమ నాయకుడు ఏమి చేయాలన్నది వారి ప్రశ్న. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార కిరీటం కేటీఅర్కే కట్టబెట్టడం ఈ క్రమంలో పెద్ద సంకేతమని వారు నమ్ముతున్నారు. హరీష్ ఉద్యమ కాలంలో తీవ్రంగా మాట్లాడారు గనుక కెసిఆర్ వ్యుహత్మకంగానే ఇలా చేసారని తరువాత ఈ ప్రభావం ఉండదని మరో వాదన. ఏమైనా జిహెచ్ఎంసి లో మంచి ఫలితాలు వచ్చాక కేటీఅర్ స్థానం ఇంకా బలపడుతుందనే భావం అందరిలో ఉంది.

యూపి లో అఖిలేష్ యాదవ్ పట్టాభిషేకం గురించి టిడిపి వారు చాల చెప్పేవారు గాని లోకెష్ కు ఆ పరిస్తితి రాలేదు. అంతకంటే కేటీఅర్ ఫార్ములా మెరుగ్గా ఉందని ఆ పార్టీ వారె అంటున్నారు. కుమారుడి చుట్టూ చేరేవారి గురించి బాబు జాగ్రత్త తీసుకోవాలని సన్నిహితులు హెచ్చరిస్తున్నారు. అదే విధంగా కేటీఅర్ కూడా తగు జాగ్రత్తలు పాటించక పొతే హరీష్ వంటివారే గాక ఇతరులలోనూ అసంతృప్తి తథ్యమని ఆ పార్టీ వర్గాల అంచనా. ఇందుకు తగినట్టే హైదరాబాద్ పర్యటనలలో కేటీఅర్ర్ను పైకి తెచ్చి సీనియర్ మంత్రులను ఉప ముఖ్య మంత్రిని కూడా తక్కువ చేయడంపై ఆయనే క్షమపణలు చెప్పవలసి వచ్చింది.

ఇలా తెలుగు రాష్ట్రాలలో పుత్రా కామేష్టి ప్రభావాలు రకరకాలుగా ఉన్నాయి. అయితే వారి వారి పిత్రుదేవుల వైఖరి పెద్దగ మరేదేమి ఉండదు..

ఇండియాలో ఎక్కడైనా అంతే అంటారు వారు. తథాస్తు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close