కాజ‌ల్ మ‌రో ప్ర‌యోగం

మెల్ల‌మెల్ల‌గా క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ల నుంచి – ప్ర‌యోగాల బాట ప‌డుతున్నారు అగ్ర క‌థానాయిక‌లు. న‌య‌న‌తార ఎప్పుడో ఈ రూటులోకి వ‌చ్చేసింది. స‌మంత కూడా స‌రికొత్త క‌థ‌ల‌వైపే దృష్టి పెడుతోంది. కీర్తి సురేష్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తోంది. కాజ‌ల్ కూడా ఇప్పుడు ఇదే పంథా ఫాలో అవుతోంది. నాని తెర‌కెక్కించిన `అ`లో ఓ విల‌క్ష‌ణ‌మైన పాత్ర పోషించింది కాజ‌ల్. లేడీ ఓరియెంటెడ్ క‌థ‌ల‌వైపు దృష్టి పెట్టింది. ఇండియ‌న్ 2 లాంటి క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేస్తూనే – న‌టిగా త‌న‌దైన మార్క్ చూపించ‌డానికి త‌హ‌త‌హ‌లాడుతోంది.

తాజాగా ఓ సినిమాకి ఓకే చెప్పింది కాజ‌ల్. ప్ర‌ముఖ నృత్య ద‌ర్శ‌కురాలు బృంద తొలిసారి మెగా ఫోన్ ప‌ట్టిన చిత్రానికి కాజ‌ల్ క‌థానాయిక‌. ఇదో హీరోయిన్ సెంట్రిక్ సినిమా. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి ప‌ట్టాలెక్క‌బోతోంది. వీలైతే బాలీవుడ్ లోనూ విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు. నాయికా ప్రాధాన్య చిత్రం అంటే.. క‌ష్టాలూ, క‌న్నీళ్లూ అనుకుంటారు. పైగా ఓ మ‌హిళ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోంది. కాబ‌ట్టి.. ఆ త‌ర‌హా క‌థ అని ఫిక్స‌వ్వ‌డం ఖాయం. కానీ.. ఈ క‌థ మాత్రం అలా ఉండ‌ద‌ట‌. అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచే కంటెంట్‌తో ఈ సినిమా రాబోతోంద‌ని తెలుస్తోంది. `అ` టైపులోనే క్లైమాక్స్ ట్విస్టు ఆశ్చ‌ర్చ ప‌రుస్తుంద‌ట‌. ఆ ట్విస్టు న‌చ్చే కాజ‌ల్ ఈ క‌థ ఓకే చేసింద‌ని టాక్. మొత్తానికి కాజ‌ల్ కూడా ప్ర‌యోగాల బాట ప‌ట్టేసింది. మ‌రి రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close