భారతీయుడుపై కాజ‌ల్ క్లారిటీ!

విక్ర‌మ్ ఇచ్చిన స్ఫూర్తితో భార‌తీయుడు 2 మ‌ళ్లీ సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. సెప్టెంబ‌రు నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లూ జ‌రుగుతున్నాయి. భార‌తీయుడు 2లో కాజ‌ల్ ఓ క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది వ‌ర‌కు ఆమెపై కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాలు కూడా చిత్రీక‌రించారు. ఆ త‌ర‌వాత ప‌రిస్థితులు మారాయి. కాజ‌ల్ కి పెళ్ల‌య్యింది. ఇప్పుడు ఓ బిడ్డ‌కు త‌ల్లి కూడా. అందుకే కాజ‌ల్ ని త‌ప్పించి, ఆమె స్థానంలో మ‌రో క‌థానాయిక‌ని తీసుకుంటార‌ని, కాజ‌ల్ పై తెర‌కెక్కించిన స‌న్నివేశాల్ని రీషూట్ చేస్తార‌ని చెప్పుకొన్నారు. వీటిపై కాజ‌ల్ క్లారిటీ ఇచ్చింది.

భార‌తీయుడు 2లో త‌న‌ని తీసేయ‌లేద‌ని, త‌న పాత్ర అలానే ఉంద‌ని, సెప్టెంబ‌రు నుంచి కూడా షూటింగ్ లో పాల్గొంటాన‌న‌ని క్లారిటీ ఇచ్చింది. ఇన్ స్టాలో అభిమానుల‌తో కాజ‌ల్ స‌ర‌దాగా చిట్ చాట్ చేసింది. ఈసంద‌ర్భంగా `భార‌తీయుడు 2` విశేషాల‌ను బ‌య‌ట‌పెట్టింది. సో… భార‌తీయుడులో కాజ‌ల్ స్థానాన్ని రిప్లేస్ చేశార‌న్న వార్త‌ల్లో ఏమాత్రం నిజం లేద‌ని తేలిపోయింది. మ‌రోవైపు శంక‌ర్ చేతిలో రామ్ చ‌ర‌ణ్ సినిమా కూడా ఉంది. దాంతో స‌మాంత‌రంగా భారతీయుడు 2 పనులు పూర్తి చేయాల్సి ఉంది. నెల‌కు స‌గం రోజుల చ‌ర‌ణ్ సినిమాకీ, మ‌రో స‌గం రోజులు చ‌ర‌ణ్ సినిమాకీ కేటాయించేలా శంక‌ర్ ప్లాన్ చేస్తున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కులాల లెక్కలేసుకుంటే జనసేనకు 40 సీట్లొచ్చేవి : పవన్

కుల , మతాలు లేని రాజకీయం రావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. మంగళగిరిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జెండా ఆవిష్కరించిన తర్వాత మాట్లాడారు. ఈ సందర్భంగా కుల, మతాల...

‘స‌లార్’ అప్‌డేట్‌: రిలీజ్ డేట్ ఫిక్స్‌

ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఎప్ప‌టి నుంచో.. ఎదురుచూస్తున్న అప్ డేట్ వ‌చ్చేసింది. 'స‌లార్‌' రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. 2023 సెప్టెంబ‌రు 28న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ...

బింబిసార విజయ రహస్యం ఇదేనా?

కరోనా తర్వాత ప్రేక్షకులు థియేటర్ కి రావడం తగ్గిపోయిందనే మాట సర్వాత్ర వినిపిస్తోంది. దీనికి కారణం ఓటీటీ ప్రభావమని కొందరంటే.. సినిమా టికెట్ రేట్లు ఇష్టం వచ్చినట్లు పెంచి మళ్ళీ తగ్గించి ప్రేక్షకుడికి...

‘బింబిసార‌’… సీక్వెల్ కాదు ప్రీక్వెల్‌

బింబిసార ఫ‌లితంతో సంబంధం లేకుండా బింబిసార 2 తీస్తామ‌ని చిత్ర‌బృందం ముందే ప్ర‌క‌టించింది. ఇప్పుడు బింబిసార అనూహ్య‌మైన విజ‌యాన్ని అందుకొంది. క‌ల్యాణ్ రామ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు. అందుకే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close