ఇంత‌కీ బుజ్జీ ఎలా ఉంది?

బుజ్జి… బుజ్జి.. బుజ్జి.. నాలుగైదు రోజులుగా ప్ర‌భాస్ ఫ్యాన్స్ క‌ల‌వ‌రిస్తున్న పేరు. ఈ బుజ్జి ఎవ‌రు? ఈ బుజ్జీకీ ‘క‌ల్కి’ సినిమాకీ సంబంధం ఏమిటి? అనే ప్ర‌శ్న‌లు, సందేహాల‌తో సోష‌ల్ మీడియాని ఊపేశారు రెబ‌ల్ స్టార్ ఫ్యాన్స్‌. ఈ బుజ్జి అనేది ఓ వాహ‌నం అని, ‘క‌ల్కి’ కోస‌మే ప్ర‌త్యేకంగా త‌యారు చేశార‌ని చిత్ర‌బృందం ముందే చెప్పేసింది. అయితే ఆ వాహ‌నం ఎలా ఉంటుందో, దాని ప్ర‌త్యేక‌త‌లేంటో ఎవ‌రికీ తెలీదు. ఈ స‌స్పెన్స్‌కు తెర దించుతూ.. బుజ్జిని ప‌రిచ‌యం చేసేసింది చిత్ర‌బృందం. ఇందుకోసం హైద‌రాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించింది చిత్ర‌బృందం. ఈ వేడుక‌లో… బుజ్జిని డ్రైవ్ చేసుకొంటూ ప్ర‌భాస్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ విజువ‌ల్స్‌.. ప్ర‌భాస్ అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తాయి. ఓ సినిమాలోని ప్రోప‌ర్టీని ప‌రిచ‌యం చేయ‌డానికి ఇంత భారీ ఎత్తున ఈవెంట్ చేయ‌డం నిజంగా షాకింగ్ విష‌య‌మే.

ఈ వాహ‌నం కూడా ఆషామాషీగా లేదు. దాని డిజైన్ కొత్త‌గా అనిపించింది. ఈ సినిమాలో బుజ్జిది ఓ కీల‌క పాత్ర‌. ఆ వాహ‌నానికి కీర్తి సురేష్ డ‌బ్బింగ్ చెప్ప‌డం.. మ‌రింత అందాన్ని, క్రేజ్‌నీ తీసుకొచ్చింది. క‌ల్కిలో వార్ ఎపిసోడ్స్ లో బుజ్జి క‌థానాయ‌కుడికి స‌హాయ‌ప‌డుతుంది. అదే బుజ్జి టీజ‌ర్‌లోనూ చూపించారు. ఓర‌కంగా చెప్పాలంటే ఐఫోన్‌లో వినిపించే `సిరి`కి పూర్తి అప్‌డేటెడ్ వెర్ష‌న్ గా అనిపించింది. ప్ర‌భాస్ – బుజ్జి పాత్ర‌ల మ‌ధ్య సాగే సంభాష‌ణ‌లు ఈ సినిమాలో కావల్సినంత వినోదం పంచి పెట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. సినిమా కోసం ప్ర‌త్యేకంగా వాహ‌నాలు త‌యారు చేయ‌డం ఇది వ‌ర‌కే చూశాం. అయితే.. అలాంటి వెయికిల్స్ బ‌య‌ట న‌డ‌ప‌డానికి ప‌నికి రావు. కానీ.. బుజ్జి మాత్రం ప్ర‌త్యేకం. ఓ ర‌కంగా చెప్పాలంటే బుజ్జి పేరు చెప్పి కొత్త కారు మోడ‌ల్ త‌యారు చేసేసింది చిత్ర‌బృందం. మెకానిక్ ఇంజ‌నీర్స్ చేయాల్సిన ప‌ని… ఓ సినిమా బృందం చేసేసింది. ఇంత‌కంటే గొప్ప‌త‌నం ఏముంది? మొత్తానికి ‘కల్కి’ సినిమాకు బుజ్జి ఓ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ అయిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఊపిరి పీల్చుకున్న డబ్బింగ్ బొమ్మ

తమిళ సినిమాలు తెలుగులో తెగ అడేస్తాయి. విక్రమ్, జైలర్ విజయాల్లో తెలుగు ప్రేక్షకుల వాటానే ఎక్కువ. అయితే కొన్నాళ్ళుగా తమిళ సినిమాల సందడి తగ్గింది. ఇలా రావడం అలా వెళ్ళిపోవడమే కానీ ఒక్కటంటే...

ట్రైనీ ఐఏఎస్ గా కూతురు… ఉప్పొంగిన హృదయంతో తండ్రి సెల్యూట్

ఆ దృశ్యం... అందరినీ కదిలించింది. ఆమె విజయం.. ఆ కన్నతండ్రికి గర్వకారణమైంది. తమ పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటే చూసి మురిసిపోవాలని తండ్రులందరూ భావిస్తారు. కానీ కొంతమంది తండ్రుల ఆశలు మాత్రమే...

చెవిరెడ్డి శ్రీవారి దర్శన వ్యాపారం రేంజే వేరు !

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి .. జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్ రెడ్డి సతీమణికి తన ఇంటి పక్కన గోశాల లాంటి కుటీరం కావాలని అనిపిస్తే.. అఘమేఘాల మీద కట్టేస్తాడు....

ఫర్నిచర్‌కు జగన్ డబ్బులిచ్చేస్తారట !

సీఎంగా చేసి ఫర్నీచర్‌ను కొట్టేశారని జగన్ పై వస్తున్న ఆరోపణలకు వైసీపీ స్పందించింది. ఓడిపోగానే.. ప్రజాధనంతో క్యాంప్ ఆఫీసు కోసం కొనుగోలు చేసిన వస్తువులన్నింటికీ డబ్బులిస్తామని ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని వైసీపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close