సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసుకుని గెలుస్తున్నామని సంబరపడిపోయిన బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల ఫలితాలు గట్టి షాక్ ఇచ్చాయి. ఆ పార్టీ తీరును కల్వకుంట్ల కవిత కూడా ఎద్దేవా చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సోషల్ మీడియానే ఉందని..క్యాడర్ లేదన్నారు. కేటీఆర్ ఇప్పటికైనా నిజం తెలుసుకుని.. వాస్తవ ప్రపంచంలోకి రావాలని సలహా ఇచ్చారు. బీఆర్ఎస్ క్యాడర్ తమతో టచ్ లో ఉన్నారని స్పష్టం చేసారు.
బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉండి క్యాడర్ ను పెంచుకోలేదని.. జగదీశ్‌రెడ్డి, మదన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి వంటి వారు వందల కోట్లు మాత్రం పోగేసుకున్నారన్నారు. రీజనల్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ హరీష్ రావు ఫాంహౌస్ కోసమే మార్చారని విమర్శించారు. బీఆర్ఎస్కు చెందిన పెద్ద రైతుల కోసం చిన్న రైతులను బలిచేస్తున్నారు. హరీశ్‌రావు ఫాంహౌజ్ ఆ సమీపంలో ఉండటంతోనే రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చారని రైతులు చెబుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు గంగుల కమలాకర్, నవీన్ రావు ఓ ల్యాండ్ కోసం ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చారు.
వీళ్లు చేసే అరాచకాల వల్లే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. వీరంతా కేసీఆర్‌ను తప్పుదోవ పట్టించి అక్రమాలకు పాల్పడ్డారు. ర్ఆర్ఆర్లో భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ. కోటి ఇవ్వాలి. లేదంటే భూమికి భూమి ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. హరీష్, రేవంత్ రెడ్డి దోస్తులని..హరీశ్‌రావు బినామీలు, వారి కంపెనీలతో సీఎం రేవంత్‌రెడ్డికు సంబంధాలు ఉన్నాయనన్నారు. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల ఫలితాల తర్వాత కవిత మరింత దూకుడుగా విమర్శలు చేస్తున్నారు.


