రిజర్వేషన్‌ స్టోరీలో మరో ట్విస్ట్‌ !?

కాపులకు అయిదు శాతం రిజర్వేషన్‌ కోసం కేంద్రానికి రాయాలని ఎపి శాసనసభ తీర్మానం చేయడం వెనక పెద్ద వ్యూహమే వుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మొదటి ప్రయోజనం ముద్రగడ పద్మనాభం శిబిరాన్ని నిరాయుధం చేయొచ్చు. ఎంతో కొంత ఇస్తామంటున్నారు గదా అన్న భావన వస్తే వారి ఆందోళన పదును తగ్గుతుంది. ముద్రగడ కూడా కొంతవరకూ సంతోషమేనని అనడమే అందుకు సంకేతం. మొదటి అడుగు పడిందనీ, భోజనం పెడతానని టిఫిన్‌ పెట్టారని కూడా వ్యాఖ్యానించారు. ఎంతో కొంత చేశారనే అర్థం ఈ మాటల్లో ధ్వనిస్తుంది.ఇక వైసీపీ నాయకుడు కాపు ప్రముఖుడు అంబటి రాంబాబు మంజునాథ కమిషన్‌ నివేదిక రాకుండా ఇవ్వడం వల్ల ఇది కోర్టులో నిలవదనే వాదనతో వ్యతిరేకత ప్రకటించారు. అయితే మెజార్టి సభ్యుల నివేదికలు వచ్చాయని వాదించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇక మంజునాథ ఒక్కరే ఎందుకు ఇవ్వలేదు?అందరికీ న్యాయం జరిగేట్టు తన నివేదిక వుంటుందని ఆయన అనడంలో అర్థమేమిటి? బహుశా అగ్రవర్ణపేదలకు కూడా ఆయన రిజర్వేషన్‌ సిఫార్సు చేసి వుండొచ్చని రాజకీయ వర్గాలు వూహిస్తున్నాయి. ఆయన ఇచ్చాక ప్రభుత్వం దాన్ని కూడా అధ్యయనం చేస్తానని ప్రకటిస్తే ఇతర తరగతులకూ తాయిలం ఆశచూపినట్టు అవుతుంది. కాబట్టి రిజర్వేషన్‌ కథలో ఇంకా చాలా ట్విస్టులుంటాయి. బిసిలు కాపుల మధ్య పెద్ద ఘర్సణగా మారే అవకాశం మాత్రం వుండకపోవచ్చు. అలాటి ప్రయత్నాలు విఫలమైనాకే ప్రభుత్వం ఈ ప్రకటనచేసింది. ఈ క్రమంలో ఆర్‌.కృష్ణయ్యతో పాటు మరికొందరు బిసి నేతలు కూడా విమర్శలు మూటకట్టుకోవచ్చు. కృష్ణయ్య టిడిపినుంచి తప్కుకోవడానికి ఒక సాకు కావచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌థ‌లు వింటున్న త్రివిక్ర‌మ్‌

స్వ‌త‌హాగా త్రివిక్ర‌మ్ మంచి ర‌చ‌యిత‌. ఆ త‌ర‌వాతే ద‌ర్శ‌కుడ‌య్యాడు. త‌న క‌థ‌ల‌తోనే సినిమాలు తీశాడు. తీస్తున్నాడు. `అ.ఆ` కోసం ఓ న‌వ‌ల ని ఎంచుకున్నాడు. ర‌చ‌యిత్రికి కూడా క్రెడిట్స్ ఇచ్చాడు. అయితే.. క‌థ‌ల...

ఆత్మ‌క‌థ రాస్తున్న బ్ర‌హ్మానందం

అరగుండుగా `అహ‌నా పెళ్లంట‌`లో న‌వ్వించాడు బ్ర‌హ్మానందం. అది మొద‌లు.. ఇప్ప‌టి వ‌ర‌కూ వంద‌లాది చిత్రాల్లో హాస్య పాత్ర‌లు పోషించి, తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు. ప‌ద్మ‌శ్రీ‌తో ప్ర‌భుత్వం...

క‌మ్ బ్యాక్ కోసం నిత్య‌మీన‌న్ ఆరాటం

అవ‌కాశాలు వ‌చ్చిన‌ప్పుడే ఒడిసిప‌ట్టుకోవాలి. అవి చేజారిపోయాక‌.. ఆరాట‌ప‌డ‌డంలో అర్థం లేదు. చిత్ర‌సీమలో అవ‌కాశ‌మే గొప్ప‌ది. దాన్ని ఎంత వ‌ర‌కూ స‌ద్వినియోగం చేసుకుంటామ‌నే విష‌యంపైనే కెరీర్ ఆధార‌ప‌డి ఉంటుంది. ఆ సంగ‌తి నిత్య‌మీన‌న్‌కి ఇప్పుడిప్పుడే...

గీతా ఆర్ట్స్‌లో వైష్ణ‌వ్ తేజ్‌

గీతా ఆర్ట్స్‌కీ, మెగా హీరోల‌కూ ఓ సెంటిమెంట్ ఉంది. తొలి సినిమాని బ‌య‌టి బ్యాన‌ర్‌లో చేయించి, రెండో సినిమా కి మాత్రం గీతా ఆర్ట్స్ లో లాక్ చేస్తుంటారు. రామ్ చ‌ర‌ణ్ అంతే....

HOT NEWS

[X] Close
[X] Close