తెలంగాణ జాగృతి తరపున నిర్వహించి బీసీ ధర్నా, మానవహారంలో కవిత పెద్దకమారుడు అర్జున్ కూడా పాల్గొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధిస్తామన్న డిమాండ్ ఉన్న ప్లకార్డులు పెట్టుకుని రోడ్డుపై భైఠాయిచారు. ఈ ధర్నాలో ఆయన హైలెట్ అయ్యారు. అమెరికాలో చదువు పూర్తి చేసుకుని వచ్చిన ఆదిత్య ప్రస్తుతం తల్లితో పాటు రాజకీయాల్లో అడుగు పెట్టాలని డిసైడయినట్లుగా కనిపిస్తోంది.
కవితకు ఇద్దకు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు ఇటీవల అమెరికా చదువు కోసం వెళ్లారు. పెద్దకుమారుడు చదువు పూర్తి కావడంతో ఇక్కడే ఉంటున్నారు. తెలంగాణ జాగృతి వ్యవహారాలతో పాటు.. కుమారుడ్ని కూడా ప్రజాజీవితంలోకి తీసుకు రావాలన్న ఉద్దేశంతోనే కవిత బీసీ ధర్నాకు తీసుకు వచ్చారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
కుటుంబకార్యక్రమాల్లో తప్ప ఎప్పుడూ పార్టీ పరమైన కార్యక్రమాల్లో కనిపించని కవిత కుమారుడు రోడ్డెక్కడంతో అందరూ కవర్ చేయడానికి ఆసక్తి చూపించారు. ఇటీవల ఏపీలో షర్మిల కూడా తన కుమారుడ్ని రాజకీయాల్లోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాగే ఓ రైతుల పరామర్శ కు వెళ్లేటప్పుడు తనతో పాటు తీసుకెళ్లారు.