భారత రాష్ట్ర సమితి ఇప్పుడు కవితను చూసి వణికిపోతోంది.ఆమె రాజకీయాలను తట్టుకోలేక ఇక ఘాటు రాజకీయాలకు తెరలేపింది. కవిత …కేసీఆర్ కుమార్తె అని తెలుసు. అయినా ఆమెను మాధవరం కృష్ణారావు కుక్కతో పోల్చారు. ఇది చిన్న విషయం కాదు. ఆయన అలా ఘాటుగా మాట్లాడే మనిషి కాదు. మాట్లాడించారని అనుకోవచ్చు. మాధవరం కృష్ణారావు కూడా.. అదే సామాజికవర్గానికి చెందిన వారు. ఎక్కడా తేడా రాకుండా ప్రణాళికా బద్దంగా దాడి చేయించారు. అందులోనే బీఆర్ఎస్ భయం ఏమిటో కూడా బయటపెట్టుకున్నారు.
హరీష్‌ను బయటకు పంపడమే కవిత మొదటి లక్ష్యం
కవిత రాజకీయంలో భారత రాష్ట్ర సమితికి మొదటి చాలెంజ్ గా మారిన అంశం హరీష్ రావు, కవిత మొదటగా హరీష్ రావును బయటకు పంపాలని ప్రణాళికలు వేసుకున్నారని బీఆర్ఎస్ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. మాధవరం కృష్ణారావు కూడా అదే చెప్పారు. ఆమె ఇటీవలి కాలంలో స్పెసిఫిక్ గా హరిష్ రావును టార్గెట్ చేస్తున్నారు. తీవ్రమైన ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. ఆమె మాటల్లో.. హరీష్ రావుపై కేసీఆర్ లో అపనమ్మకం పెంచడమేనన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. హరీష్ రావు వల్ల కేటీఆర్ కూ ముప్పు ఉంటుందని ఆమె హెచ్చరిస్తున్నారు. కవిత..తన దీర్ఘ కాలిక రాజకీయ వ్యూహంలో భాగంగా.. ముందుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను బయటకు పంపాలని అనుకుంటున్నారని నిర్ణయానికి వచ్చారు. అందుకే హరీష్ రావును అందరూ ఏకపక్షంగా సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు.. కానీ కవిత ప్రయత్నాలు ఫలించి ఎక్కడైనా హరీష్ పై అపనమ్మకం ఏర్పడినా…తనను అనుమానంగా చూస్తున్నారని హరీష్ కు అనిపించినా కవిత మొదటి అడుగులో సక్సెస్ అవుతారు.
హరీష్నుబయటకు పంపేశాక కేటీఆర్‌ను జైలుకు పంపే ప్లాన్
హరీష్ రావును బయటకు పంపేసిన తరవాత కవిత..నెక్ట్స్ కేటీఆర్ పై దృష్టి పెడతారని మాధవరం కృష్ణారావు చెప్పారు. కేటీఆర్ ను జైలుకు పంపాలంటే.. రేవంత్ చేతుల్లో ఉంది. కేటీార్ పదే పదే సవాల్ చేస్తున్నా అరెస్టు చేయడం లేదు. అయితే హరీష్ ను బయటకు పంపిన తర్వాత కేటీఆర్ ను జైలుకు పంపించాలన్న ప్రణాళికతో కవిత ఉన్నారని.. ఈ విషయంలో రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యారని స్వయంగా బీఆర్ఎస్ పెద్దలు నమ్ముతున్నారు. పరిణామాలు అక్కడి వరకూ వస్తాయా లేదా అన్నది చెప్పలేం కానీ..కేటీఆర్ అరెస్టు అనే అంశం మాత్రం నలుగుతోంది.
ఆ తర్వాత పార్టీకి క్యాప్చర్ చేయనున్న కవిత
హరీష్ రావును బయటకు పంపి.. కేటీఆర్ ను అరెస్టు చేయించిన తర్వాత కవిత అప్పుడు బీఆర్ఎస్ పార్టీని క్యాప్చర్ చేస్తారని .. అదే ఆమె మాస్టర్ ప్లాన్ అని బీఆర్ఎస్ వర్గాలకు స్పష్టమైన అవగాహన వచ్చింది. కేసీఆర్ అనారోగ్యం వల్ల పార్టీని నడిపే పరిస్థితి లేదని .. హరీశ్ రావు లేకుండా..కేటీఆర్ జైలు పాలయిన తర్వాత ఇక కవిత నాయకత్వాన్ని కేటీఆర్ ఇష్టం లేకపోయినా ఆమోదిస్తారని కవిత ప్లాన్ గురించి అనుమానిస్తున్న వారు అనుకుంటున్నారు. ఈ పరిణామం కోసమే ఇంకా జాగృతిని రాజకీయ పార్టీగా ప్రకటించకుండా రాజకీయాలు చేస్తున్నారని చెబుతున్నారు.
మాధవరం కృష్ణారావు బయటపెట్టిన కవిత ప్లాన్ లో ఎంత నిజం ఉందో కానీ.. ఇదే చేయడానికి ప్లాన్ చేస్తున్నారని బీఆర్ఎస్ పెద్దలు మాత్రం వణికిపోతున్నారని ఓ క్లారిటీ అయితే వచ్చేస్తుంది.
