కేసీఆర్ సమస్త తెలంగాణ ప్రజానీకాన్ని నిరాశపరిచారా..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మైక్ పట్టుకున్నారంటే.. ఎదుట కూర్చున్న వాళ్లు జర్నలిస్టులైనా సరే పగలబడి నవ్వాల్సిందే. వినేవాళ్లకి నవ్వు వస్తుంది కానీ.. అవి ఎవరి మీద అయితే వేస్తున్నారో వారికి కాలిపోతుంది. అటు ఎంత కామెడీ ఉంటుందో.. అంత సీరియస్‌ నెస్ కూడా ఉంటుంది. అందుకే కేసీఆర్ స్పీచ్ అందర్నీ నవ్విస్తుంది కానీ.. ఎప్పుడూ నవ్వుల పాలు కాలేదు. సాదా సీదా మీడియా సమావేశాల్లోనే ఆయన అలా మాట్లాడుతూంటారు.. అలాంటి.. పాతిక లక్షల మంది… మంది ఇంకెలా మట్లాడతారు..? ఆ వాక్ప్రవాహ పటిమను ఊహించగలమా..? ఎవరూ ఊహించలేరు. అందుకే ఎక్స్‌పెక్టేషన్స్‌ ఎక్కడికో వెళ్లిపోయాయి.

అంచనాలు కొండంత ఉంటే… ఎంత కష్టపడి గుట్ట ఎక్కినా.. అది సక్సెస్ కాదు. ఇలాంటి పరిస్థితే కేసీఆర్‌కు ఎదురయింది. ముందస్తు భేరీ మోగిస్తారేమోనని… ప్రత్యర్థులపై తనదైన శైలిలో విమర్శలతో విరుచుకుపడతారని చాలా మంది ఆశించారు. కనీ ఏదీ లేదు. చాలా సాదాసీదాగా ప్రసంగం ముగిసింది. అంచనాలకు ఎక్కడో ఉంటే.. కేసీఆర్ మాత్రం తన ప్రసంగాన్ని కొంగరకలాన్‌కే పరిమితం చేశారు. వచ్చిన వాళ్లని ఊసూరుమనిపించారు. తన మాటలతో ఉత్తమ్ ఇజ్జత్ తీసేసి… చంద్రబాబుపై సెటైర్లు వేసి పనిలో పనిగా.. ఆంధ్ర వల్ల అన్యాయమైపోతున్నామని చెబితే… వినేవాళ్లకి కాస్తంత కిక్ వచ్చేది. అన్నింటికి “సన్నాసులు” అనే పదం వినపడని కేసీఆర్ స్పీచ్ ఇటీవలి కాలంలో ఇదేనేమో..?

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేటీఆర్.. తన మాటలతోనే.. తెలంగాణ ఉద్యమాన్ని ఊపెక్కించిన నేత. ఆయన మాటల్లో ప్రగతి నివేదన సభలో అంత పదును లేదు. ఆయన తన ప్రసంగాల్లో… ఓ బెంచ్‌మార్క్ ని సృష్టించాడు. తెలంగాణ చరిత్రలో కనీవినీ ఎరుగని సభను పెట్టినప్పుడు… కేసీఆర్‌ కూడా.. తన ప్రసంగాల్లో ది బెస్ట్ అనే స్పీచ్‌ని డెలివరీ చేయాల్సి ఉంది. కానీ నిజంగా ఆయన తన సహజసిద్దమైన ఫామ్‌ను కోల్పోయారు. ఇది వ్యూహాత్మకమా..? లేక ఇంకేదైనా కారణమో.. ఇంకా ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ.. ఒక్కటి మాత్రం.. నిజం కేసీఆర్.. సమస్త తెలంగాణ ప్రజానీకాన్ని నిరాశ పరిచారు..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com