నిధులివ్వలేదనే మోడీకి కేసీఆర్ దూరం.. దూరం..!?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో.. గతంలో ఉన్నట్లుగా ఉండటం లేదు. ఇప్పుడు ఆయనకు ఎదురుపడాలని కూడా అనుకోవడం లేదు. రెండో సారి మోడీ ప్రధానిగా గెలిచినప్పటి నుంచి కనీసం శుభాకాంక్షలు చెప్పలేదు సరికదా… నీతిఆయోగ్ లాంటి కీలక సమావేశాన్ని లైట్ తీసుకున్నారు. అలాగే.. జమిలీ ఎన్నికలపై… జరుగుతున్న అఖిలపక్ష సమావేశానికి కుమారుడ్ని పంపుతున్నారు. మొహం చెల్లకనే… వెళ్లడం లేదన్న బీజేపీ నేతల విమర్శలపై… కేసీఆర్ కాస్త ఘాటుగానే స్పందించారు. సిల్లీ నేతలు.. సిల్లీ విమర్శలు చేస్తూంటారని విమర్శించారు.

మోడీతో భేటీలకు ఆసక్తి చూపని కేసీఆర్..!

కొద్ది రోజుల క్రితం.. జరిగిన నీతిఆయోగ్ సమావేశానికి కూడా.. కేసీఆర్ హాజరు కాలేదు. మోడీతో తీవ్రమైన రాజకీయ విబేధాలుండటంతో… మమతా బెనర్జీ హాజరు కాలేదు. కానీ.. మోడీతో.. ఎక్కడా పెద్దగా విబేధాలున్నట్లు బయటపడని.. కేసీఆర్ మాత్రం… డుమ్మాకొట్టారు. అంతే కాదు.. కనీసం ప్రతినిధి బృందాన్ని కూడా.. తెలంగాణ తరపు నుంచి పంపకపోవడం చర్చనీయాంశమయింది. అయితే..కేసీఆర్ మోదీతో నేరుగా భేటీ అయ్యేందుకు అపాయింట్ మెంట్ కోరారని ఖరారు కానందుకే ఢిల్లీకి వెళ్లలేదని టీఆర్ఎస్ వర్గాలు మీడియాకు చెప్పాయి. ఇప్పుడు..నేరుగా..మోడీ ప్రత్యేకంగా …ఆహ్వానించినా..కేసీఆర్ మాత్రం… మోడీ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను పంపుతున్నారు.

మోడీ – కేసీఆర్ మధ్య ఏదో జరిగిందని రాజకీయనేతల అనుమానాలు..!

ఎన్నికలు ముగిసినప్పటి నుంచి.. బీజేపీతో… టీఆర్ఎస్ అధినేత…దూరం పాటిస్తున్నట్లుగా …జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే తెలిసిపోతుంది. మోడీ ప్రమాణస్వీకారానికి వెళ్లలేదు. నీతి ఆయోగ్ భేటీకి వెళ్లలేదు. ఇప్పుడు పార్టీల సమావేశానికీ వెళ్లడం లేదు. కనీసం.. రెండో సారి గెలిచినందుకు.. మోడీని.. కేసీఆర్ అభినందించలేదు కూడా. దీంతో.. బీజేపీ – టీఆర్ఎస్ మధ్య సంబంధాలు అంత సానుకూలంగా లేవన్న విషయం మాత్రం స్పష్టమవుతోందంటున్నారు. మొహం చెల్లకనే… మోడీ ఎదుటకు..కేసీఆర్ వెళ్లడం లేదని.. బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నా… టీఆర్ఎస్ నేతలు స్పందించడం లేదు. దీంతో.. ఏదో జరిగిందనే.. అభిప్రాయం మాత్రం పెరిగిపోతోంది.

నీతిఆయోగ్ చెప్పినా నిధులివ్వలేదన్న కారణమేనా..?

కానీ.. మోడీతో.. దూరం జరగడానికి కారణం.. తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడమేనని.. కేసీఆర్ మాటల్లో స్పష్టమవుతోంది. కాళేశ్వరం లాంటి ఓ అద్భుతమైన ప్రాజెక్ట్ కు.. ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి రాలేదని… ఆయన ఆవేదన కేబినెట్ భేటీ తర్వాత జరిగిన ప్రెస్‌మీట్‌లో కనిపించింది. మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి గతంలో మోడీని ఆహ్వానించారు. ఆయన వచ్చి.. ప్రారంభం చేసి వెళ్లారు. ఆ తర్వాత అయినా.. ఆ ప్రాజెక్టుకు కొన్ని నిధులు వస్తాయనుకున్నారు. కానీ రాలేదు. నీతి ఆయోగ్ కూడా… కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కేంద్రానికి సూచించింది.కానీ ఒక్క రూపాయి కూడా కేంద్రం ఇవ్వలేదు. ఏ మాత్రం సాయం చేయని కేంద్రానికి క్రెడిట్ ఎందుకివ్వాలన్న ఉద్దేశంతో.. మోడీని కేసీఆర్ లైట్ తీసుకుంటున్నారని.. ఆయన మాటలను బట్టి అర్థమవుతోందని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com