ప్రాణం పోయినా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను: కేసీఆర్

కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా సాధన కోసం అంటూ నల్లగొండలో కేసీఆర్ నిర్వహించిన సభలో కేసీఆర్ రేవంత్ పై బూతులందుకున్నారు. ఆయన మేడిగడ్డ సందర్శనకు ఎమ్మెల్యేలను తీసుకుపోవడంపై మండిపడ్డారు. మేడిగడ్డ..బొందల గడ్డ అంటూ రెచ్చిపోయారు. తాను కూడా మేడిగడ్డకు స్టేజిపై ఉన్న వారినందర్నీ తీసుకుపోయి మీ బండారం బయటపెడతానని హెచ్చరించారు. నల్లగొండలో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ కూర్చునే ప్రసంగించారు. . తన ప్రాణం పోయినా తెలంగాణకు అన్యాయం జరగనివ్వబోనని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చి చెప్పారు. కృష్ణా జలాల కోసం చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘క్రిష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన సంపూర్ణమైన వాటా వచ్చేదాకా కొట్లాడతామననారు. తాను పిలుపిస్తేనే భయపడి సభలో తీర్మానం పెట్టారు. దాంతో చాలదు. అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్రానికి తీసుకుపోవాలని డిమాండ్ చేశారు.

కావాలంటే ఐదేళ్లు అధికారంలో ఉండండి. మాకేం ఇబ్బంది లేదు. ఉమ్మడి రాష్ట్రమే బాగుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఇచ్చేలా ఢిల్లీలో సంతకం పెట్టి వచ్చారు. నాలుగైదురోజులు కాంగ్రెస్ మంత్రులు నాటకాలాడారు. అసెంబ్లీలో కూడా బడ్జెట్ పక్కకు పెట్టి ప్రాజెక్టులపై చర్చ పెట్టారు. సాగునీటిపారుదల మంత్రిగా పని చేసినందునే మొన్న హరీశ్ రావు గట్టిగా సమాధానం ఇచ్చారు. ప్రజల్లోనే తేల్చుకుందామని నల్గొండ సభకు పిలుపు ఇచ్చా. నేను పిలుపు ఇవ్వగానే సభలో హడావుడిగా తీర్మానం పెట్టారు. అది కూడా సరిగ్గా పెట్టలేదు. దాంట్లో విద్యుత్ సంగతి లేనేలేదు. కాంగ్రెస్ వాళ్లు తెలివి తక్కువ తీర్మానం పెట్టారని ఆరోపించారు. కొత్త ప్రభుత్వం ఒక్కటైనా మంచి పని చేస్తుందా? గట్టిగా మాట్లాడితే మీరు పెద్దోళ్లు అయిపోతరా? ఎవరికీ అధికారం శాశ్వతం కాదు. తెలంగాణ ప్రజల హక్కులు, వాటాలు శాశ్వతం. కేసీఆర్ సర్కారు పోగానే స్విచ్ తీసేసినట్లు కరెంటు పోతోంది. అసెంబ్లీలోనే జనరేటర్లు తెచ్చి పెడుతున్నరు.. అలాంటిది ఏప్రిల్, మే నెలల్లో 24 గంటల కరెంటు ఇస్తరా? నేను తొమ్మిదిన్నరేళ్లు 24 గంటల కరెంటు ఇచ్చా. ఇప్పుడు కరెంటు ఏమైపోయింది? చేతగాని వాళ్ల రాజ్యం ఇలాగే ఉంటుంది. కరెంటు కోసం అందరూ ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు.

మేం ఈ ఛలో నల్గొండతోనే ఆపం.. ఇలాంటి పోరాటం సాగుతూనే ఉంటుందన్నారు. మీకు దణ్నం పెట్టి చెప్తున్నా.. నేను మీ బిడ్డను, చావు నోట్లో తలకాయ పెట్టి చావు వరకూ పోయి తెలంగాణ తెచ్చింది నేను. అందుకే రాష్ట్రం బాగు కోసం నాకు తన్నులాట ఉంటదని కేసీఆర్ వేడుకున్నట్లుగా ప్రసంగించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలపై తెలంగాణను మించి ఏపీ పోలీసుల దాష్టీకం – విజయమ్మ స్పందనేమిటో ?

తెలంగాణలో షర్మిల రాజకీయ పోరాటం చేస్తున్న సమయంలో పోలీసులు ఆమెను ఓ సారి ఆపిన సందర్భంలో విజయమ్మ బయటకు వచ్చి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంద్‌కు పిలుపునివ్వమంటారా.. ఆందోళనలు చేయాలని పిలుపునివ్వమంటారా...

28న తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన సమరభేరీ !

తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి ప్రచారానికి సిద్ధమ్యాయి. ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన తాడేపల్లి గూడెంలో ఉమ్మడి బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు. విజయవాడలో జరిగిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం...

బుర్రా బ్యాన‌ర్… ‘ఎస్‌.ఎం.ఎస్‌’

స్టార్ రైట‌ర్‌.. బుర్రా సాయిమాధ‌వ్ నిర్మాత‌గా మారారు. ఆయ‌న ఎస్‌.ఎం.ఎస్ అనే నిర్మాణ సంస్థ‌ని ప్రారంభించారు. అంటే.. సాయిమాధ‌వ్ స్క్రిప్ట్స్ అని అర్థం. తొలి ప్ర‌య‌త్నంగా ఈటీవీ విన్‌తో క‌లిసి ఓ సినిమాని...

తిరుమల శ్రీవారి ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు : రమణ దీక్షితులు

గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వంపై రమణదీక్షితులు చేసిన ఆరోపణల గురించి చెప్పాల్సిన పని లేదు. వాటిని పట్టుకుని వైసీపీ నేతలు చేసిన ఆరోపణలూ శృతి మించాయి. చివరికి టీటీడీ పరువు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close