చేతకాక, చేవచచ్చి : హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా కొనసాగాలంటున్న వైసీపీ !

వైసీపీ నేతలు పూర్తిగా సిగ్గూ ఎగ్గూ వదిలేస్తున్నారు. ప్రజలు ఐదేళ్లు పరిపాలించమని చేతికి ఇస్తే.. మొత్తం సర్వనాశనం చేసేసి మళ్లీ మొదటికి పోదామని పత్తిత్తు కబుర్లు ప్రారంభించారు. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ వైసీపీలో పెత్తనాలు చేసే రెడ్డి నేతలు కొత్త వాదన అందుకున్నారు. తాను ఈ విషయాన్ని రాజ్యసభలో మాట్లాడుతానంటూ..ఇంకా రాజ్యసభకు ఎన్నిక కాక ముందే సుబ్బారెడ్డి మాట్లాడేస్తున్నారు. అలా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అయితే మంచిదేనని పెద్దిరెడ్డి కూడా స్వరం కలిపారు.

నిజానికి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే సంగతిని చాలా మంది మర్చిపోయారు. టీడీపీ హయాంలో అమరావతిని రాజధానిగా నిర్ణయించి అక్కడకు తరలించినా..హైదరాబాద్ లో తమ హక్కు మేరకు ఉన్న భవనాల్లో కార్యకలాపాలు నిర్వహించేవారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఏపీ ప్రభుత్వానికి సెక్రటేరియట్ లో ఉన్న భవనాలను తెలంగాణ సర్కార్ కు అప్పగించారు. కేసీఆర్ వెంటనే వాటిని కూలగొట్టి పెద్ద సెక్రటేరియట్ నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఏపీకి సంబంధించి ఏ ఒక్క కార్యాలయం కూడా తెలంగాణ నుంచి నడవడం లేదు. చివరికి ఉమ్మడి రాజధాని అయినప్పటికీ కరోనా సమయంలో పేషంట్లు ఏపీ నుంచి హైదరాబాద్ వస్తూంటే..తెలంగాణ పోలీసులు ఆపారు.

అప్పుడు కూడా ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. వివిధ అంశాల్లో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే విషయాన్ని గుర్తు చేయాల్సి వచ్చినప్పుడల్లా సీఎం జగన్ సర్కార్ మౌనంగానే ఉంది. చేతిలో ఉన్న అమరావతిని నిర్వీర్యం చేసిన చేతకాని తనానికి.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ చేసిన దోపిడీకి మధ్య చివరికి చేవచ్చిన వైసీపీ రాజకీయం ఉమ్మడి రాజధాని హైదరాబాద్ దగ్గరకు వస్తోంది. ఉమ్మడి రాజధాని అయినా కాకపోయినా ప్రజల అవకాశాల్లో ఏ మాత్రం తేడా లేదు.

విభజన చట్టం ప్రకారం పదేళ్లే ఉమ్మడి రాజధాని.. ఆ తర్వాత ఆ పేరు కూడా ఉండదు. ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటే.. విభజన చట్టంలో మార్పులు చేయాలి. అది సాధ్యం కాదు. కానీ తమ చేతకాని తనాన్ని రాజకీయంగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇప్ుపడు వైసీపీ నేతలు అదే చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close