టీడీపీ రాష్ట్రానికి అవ‌స‌ర్లేదు… కానీ, తెరాస‌కి కావాలట‌!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా కేసీఆర్ ప్రచార‌మంతా ఎక్కువగా టీడీపీ ల‌క్ష్యంగానే సాగుతోంద‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌చార స‌భ‌ల్లో టీడీపీపై విమ‌ర్శ‌లు చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. తెలంగాణ‌లో టీడీపీకి ప‌నేముంది అంటారు. ప్ర‌జ‌ల మ‌ధ్య చిచ్చు పెట్ట‌డానికే మ‌రోసారి చంద్ర‌బాబు నాయుడు ఈ రాష్ట్రంలోకి వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆరోపించారు. తెలంగాణ‌కు చంద్ర‌బాబు శ‌ని అని కూడా అనేశారు! ఈ స్థాయిలో టీడీపీ మీదా, చంద్ర‌బాబు నాయుడు మీద కేసీఆర్ ద్వేషాన్ని వెళ్ల‌గ‌క్కుతున్నారు. కానీ, ఇదంతా ప్ర‌జ‌ల ముందు చేస్తున్న షో..! నాయ‌కుల ద‌గ్గ‌ర‌కి వ‌చ్చేస‌రికి, ఎన్నిక‌ల వ్యూహాల ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి కేసీఆర్ తీరు మ‌రోలా ఉంటోంది.

రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు త‌ర‌హా వ్యూహాన్ని అనుస‌రించాలంటూ పార్టీ నేత‌ల‌కు కేసీఆర్ సూచించారు. 2014 ఎన్నిక‌ల్లో అతి విశ్వాసంతో జ‌గ‌న్ ఆంధ్రాలో ఓడిపోయార‌నీ, పక్కా ప్ర‌ణాళిక‌తో టీడీపీ విజ‌యం సాధించింద‌న్నారు. అదే వ్యూహాన్ని అనుస‌రించి 2019 ఎన్నిక‌ల్లో తెరాస అభ్య‌ర్థులు గెల‌వాల‌న్నారు. ఎన్నిక‌లు ప్రారంభ‌మైన తొలి గంట‌లోనే టీడీపీ మ‌ద్ద‌తుదారుల‌ను పెద్ద ఎత్తున పోలింగ్ బూతుల‌కు ర‌ప్పించ‌గ‌లిగార‌నీ, ఆ త‌రువాత ప్ర‌త్య‌ర్థి శిబిరాల‌పై ఫోక‌స్ పెట్టారనీ, తద్వారా టీడీపీ అనుకున్న స్థాయిలో ఓటింగ్ చేయించుకో గ‌లిగింద‌ని కేసీఆర్ నేత‌ల‌కు వివ‌రించారు. తెలంగాణ‌లో తెరాస నేత‌లంతా అదే వ్యూహాన్ని అనుసరించి, ల‌బ్దిదారులు అంద‌ర్నీ క‌ల‌వాల‌న్నారు. పోలింగ్ రోజున ఓటింగ్ ప్రారంభ‌మైన తొలి గంట‌లోనే మ‌ద్ద‌తుదారులంతా వ‌చ్చేట్టు చూసుకోవాల‌న్నారు. జ‌గ‌న్ మాదిరిగా ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ కి వెళ్లొద్ద‌ని కూడా సూచించారు.

తెరాస నేత‌ల ఎన్నిక‌ల వ్యూహాల ద‌గ్గ‌ర‌కి వ‌చ్చేస‌రికి తెలుగుదేశం పార్టీ ఆద‌ర్శ‌ప్రాయం అయిపోయింది, అనుస‌ర‌ణ‌నీయం అయిపోయింది. కానీ, ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కి వ‌చ్చేస‌రికి… తెలంగాణ వ్య‌తిరేక పార్టీగా టీడీపీని ప్రొజెక్ట్ చేస్తుంటారు కేసీఆర్‌…! తెలంగాణ‌లో టీడీపీ అవ‌స‌రం లేదంటారుగానీ, తెరాస‌కు ఆ పార్టీ వ్యూహాలు అవ‌స‌రం అన్న‌ట్టుగానే కేసీఆర్ తీరు క‌నిపిస్తోంది. తెలంగాణ‌కు టీడీపీ అవ‌స‌రం లేద‌నుకున్న‌ప్పుడు… ఆ పార్టీ ప్ర‌స్థావ‌నే ఏ స్థాయిలోనూ తీసుకుని రాకూడ‌దు క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

HOT NEWS

css.php
[X] Close
[X] Close