సంతోష్‌బాబు కుటుంబానికి కేసీఆర్ భరోసా..!

సరిహద్దులలో చైనా సైనికుల ఉన్మాదం కారణంగా వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి కేసీఆర్ అండగా నిలిచారు. ప్రభుత్వం ప్రకటించిన ఐదు కోట్ల సాయాన్ని స్వయంగా అందచేశారు. సంతోష్ బాబు భార్యకు రూ. నాలుగు కోట్ల చెక్ ను.. ఆయన తల్లిదండ్రులకు రూ. కోటి చెక్‌ను అందచేశారు. హైదరాబాద్ షేక్ పేట పరిధిలోని జూబ్లిహిల్స్‌లో 711 గజాల స్థలాన్ని కూడా.. నివాసం కోసం కేటాయించారు. ఆ పత్రాలను కూడా అందించారు. ఆలాగే సంతోష్ బాబు భార్యకు.. గ్రూప్ వన్ అధికారిణిగా నియమించిన ఉద్యోగ పత్రాలను కూడా అందించారు.

కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి నేరుగా సూర్యాపేటకు వెళ్లారు. సంతోష్ బాబు కుటుంబసభ్యులను పరామర్శించారు. ధైర్యం చెప్పారు. అందరితోనూ.. మాట్లాడారు. ఎలాంటి కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ముందుగా సంతోష్ బాబు ఇంటి ముందు ఏర్పాటు చేసిన చిత్రపటానికి నివాళులు అర్పించారు. సంతోష్ బాబు పార్థీవదేహం కశ్మీర్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన సమయంలో.. కేసీఆర్ నివాళి అర్పించలేకపోయారు. ఆ తర్వాత సూర్యాపేటకూ వెళ్లలేకపోయారు. ఈ కారణంగా పలువురు విపక్ష నేతలు… కేసీఆర్ తీరుపై విమర్శలు చేశారు.

ఈ క్రమంలో కేసీఆర్… ఆ కుటుంబం గురించి ఆలోచించి.. రూ. ఐదు కోట్ల సాయం.. ఇంటి స్థలం.. గ్రూప్ వన్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. తానే స్వయంగా వెళ్లి పరామర్శించి భరోసా ఇచ్చి.. సాయాన్ని అందచేయాలని నిర్ణయించుకుని.. ఆ మేరకు షెడ్యూల్ ఖరారు చేసుకుని.. సూర్యాపేట వెళ్లారు. విమర్శలు చేస్తున్న వారికి దీటైన సమాధానం చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరంజీవి ని కలవడం పై వివరణ ఇచ్చిన సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిగా ఈరోజు అధికారికంగా పగ్గాలు చేపట్టారు సోము వీర్రాజు. పార్టీని 2024లో అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంలో విలేకరులతో మాట్లాడుతూండగా, ఇటీవల చిరంజీవిని...

జగన్ “స్టే” ఆశల్ని వమ్ము చేసిన తప్పుల పిటిషన్..!

మూడు రాజధానుల బిల్లుల అమలుపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌కోపై స్టే తెచ్చుకుందామనుకున్న ఏపీ సర్కార్‌కు.. కాలం కలసి రావట్లేదు. సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తున్న ఏపీ ప్రభుత్వ న్యాయ నిపుణులు తప్పుల తడకలుగా వేయడంతో.....

మాకు మహానగరాల్లేవ్.. సాయం చేయండి : జగన్

కేంద్రం నుంచి సాయం పొందాలంటే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసే విజ్ఞప్తులు కాస్త భిన్నంగా ఉంటాయి. కరోనా వైరస్ ఎక్కువ ప్రభావం చూపుతున్న పది రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో...

ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం అవసరం  : రామ్మాధవ్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని..  దాన్ని భర్తీ చేయాలని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి రామ్‌మాధవ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోము వీర్రాజు.. ఏపీ  బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు...

HOT NEWS

[X] Close
[X] Close