నితిన్‌కి నో చెప్పిన ఇలియానా?

అంధాధూన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నితిన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో ఓ నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్ర ఉంది. క‌థలో చాలా ముఖ్య‌మైన పాత్ర అది. హిందీలో ట‌బు చేసింది. తెలుగులో శిల్పా శెట్టిని ఎంచుకున్నారు. నిజానికి సౌత్ ఇండియ‌న్ ట‌చ్ ఉన్న న‌టి కోసం చిత్ర‌బృందం అన్వేషించింద‌ని టాక్‌. ఓ ద‌శ‌లో ఇలియానా పేరు కూడా ప‌రిశీలించార్ట‌. ఇలియానాని సంప్ర‌దిస్తే…నిర్మొహ‌మాటంగా `నో `చెప్పేసింద‌ని టాక్‌. ఇటీవ‌ల ఇలియానా బాగా బొద్దుగా మారింది. మ‌ళ్లీ కాస్త స్లిమ్ అవ్వ‌డానికి ఇలియానా శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తోంద‌ట‌. పైగా నెగిటీవ్ ట‌చ్ ఉన్న పాత్ర చేయ‌న‌ని చెప్పుకొచ్చింద‌ట‌.

గ‌త కొంత‌కాలంగా సౌత్ ఇండియాలో గ్రాండ్ రీ ఎంట్రీ కోసం ఇలియానా ఎదురు చూస్తోంది. అంధాధూన్ ఒప్పుకుంటే, ఇలియానాకు ప్ల‌స్ అయ్యేది. ఆ పాత్ర‌లో ఇలియానా క‌నిపిస్తే.. బాగుండేది కూడా. ఓ ర‌కంగా చెప్పాలంటే శిల్పాశెట్టి కంటే ఇలియానా బెట‌ర్ ఆప్ష‌న్ అయ్యేది. కానీ.. సింపుల్‌గా నో చెప్పేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close