ఆ పోలీసులతోనే కేసీఆర్‌ను అరెస్ట్ చేయిస్తారట !

భారతీయ జనతా పార్టీ నేతలు .. తమ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు. జాతీయ నేతలు వచ్చి తెలంగాణలో సవాళ్లు చాలెంజ్‌లు చేస్తున్నారు. బండి సంజయ్‌ను అరెస్ట్ చేయించిన పోలీసులతోనే కేసీఆర్‌ను అరెస్ట్ చేయిస్తామని తాజాగా సవాల్ చేస్తున్నారు బీజేపీ నేతలు. సొరంగంలో దాక్కున్నా సరే తీసుకొచ్చి అరెస్ట్ చేయిస్తాంటున్నారు. తెలంగాణ బీజేపీ నేతలందర్నీ వరుస పెట్టి టార్గెట్ చేసి మరీ అరెస్టులు చేయడంతో తెలంగాణలో రాజకీయం మారిపోయింది.

బీజేపీ నేతలు ముఖ్యంగా బండి సంజయ్.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అయినప్పటి నుండి కేసీఆర్ అరెస్ట్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఆయనను జైలుకు పంపుతామని చాలా సార్లు హెచ్చరించారు. ఆయన మాటలపై టీఆర్ఎస్ నేతలు ఎదురుదాడి కూడా చేస్తూ వస్తున్నారు. కానీ బండి సంజయ్ మాత్రం తగ్గడం లేదు. దీంతో టీఆర్ఎస్ నేతలు బీజేపీవి మాటలేనని.. తాము చేతల్లో చూపిస్తామన్నట్లుగా ఒక్క సారిగా విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకూ చేసిన ఘాటు వ్యాఖ్యలన్నింటిపై కేసులు పెట్టేసి బుక్ చేసే ప్రయత్నం చేశారు. అయితే బీజేపీ నేతలు మాత్రం దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారు.

తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ ఏడాదిలోనే కేసీఆర్ ముందస్తుకు వెళ్తారని గట్టి ప్రచారం జరుగుతున్న కారణంగా దానికి తగ్గట్లుగానే దూకుడు పెంచింది. కేసీఆర్‌పై అసంతృప్తి ఎక్కువగా ఉందని గట్టిగా నమ్ముతున్నకారణంగా కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడు కూడా తెలంగాణలో పెరగబోతోందన్న ప్రచారం ఊపందకుంటోంది. ఈ క్రమంలో కేసీఆర్‌ను జైలుకు పంపే అంశం మళ్లీ తెరపైకి వస్తోంది. రెండు పార్టీల మధ్య సీరియస్ రాజకీయయుద్ధం జరిగుతూంటే మాత్రం.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ.. తాను చేయాలనుకున్నది చేస్తే… రాజకీయం ఉద్రిక్తంగా మారడం ఖాయమనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close