‘ఎన్టీఆర్’ కోసం క‌లం ప‌ట్టిన కీర‌వాణి

సంగీత ద‌ర్శ‌కుల్లోనూ ఓ ర‌చ‌యిత ఉంటాడు. అప్పుడ‌ప్పుడూ డ‌మ్మీ లిరిక్స్ రాస్తుండాలి క‌దా? అయితే… ఒక్కోసారి ఆ డ‌మ్మీలే నిజంగా సినిమా పాట‌ల్లా మారిపోతుంటాయి. దేవిశ్రీ ప్ర‌సాద్ త‌న ఆల్బ‌మ్‌లో ఒక్క‌పాటకైనా త‌న పేరు ఉండేలా చూసుకుంటాడు. తాను రాసిన పాట‌ల‌న్నీ బ‌హు పాపుల‌ర్‌. కీర‌వాణి కూడా అప్పుడ‌ప్పుడు క‌లం అందుకుంటుంటారు. ‘వేదం’లో మూడు పాట‌లు రాశారాయ‌న‌. మ‌రోసారి ఓ పాట‌కు త‌న మాట సాయం అందించారు. కీర‌వాణి స్వ‌ర ప‌రుస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్‌’. ఇందులోని రెండో పాట ‘రాజ‌ర్షీ’… ఈ బుధ‌వారం విడుద‌ల కానుంది. ఈ పాట‌ని శివ‌శ‌క్తిద‌త్తా ర‌చించారు. అయితే… కీర‌వాణి కూడా ప‌ద సాయం చేశారు. ఈ పాట శివ‌శ‌క్తిద‌త్తా – కీర‌వాణి పేర్ల‌తోనే బ‌య‌ట‌కు రానుంది. ఈ ఆల్బ‌మ్‌లో 11 పాట‌లున్నాయి. ఎక్కువ‌శాతం శివ‌శ‌క్తి ద‌త్తానే రాశారు. సిరి వెన్నెల సీతారామ‌శాస్త్రి కూడా పాట‌ల్లో భాగం పంచుకున్నారు. తొలి పాట ‘క‌థానాయ‌క‌’ సంస్క్రృత ప‌దాల‌తో సాగింది. అయితే రెండో పాట‌లో ఆ సంస్క్కృత ప‌దాల డోసు ఇంకాస్త పెర‌గ‌బోతోంద‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com