ఐపీఎల్ 2026 సీజన్ కోసం జరిగిన మినీ వేలంలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కు జాక్ పాట్ తగిలింది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అతన్ని రూ.25.20 కోట్లకు కొనుగోలు చేసింది. రాజస్థాన్ రాయల్స్, చెన్నై జట్లు గ్రీన్ కోసం పోటీ పడ్డాయి. దీంతో అతని రేటు అంతకంతకూ పైకి పోయింది. చివరికి కేకేఆర్ పరమయ్యాడు. ఐపీఎల్ చరిత్రలో విదేశీ ఆటగాడికి పలికిన అత్యధిక ధర.
2024లో కేకేఆర్ జట్టే మిచెల్ స్టార్ట్క్ రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసిన రికార్డే ఇప్పటికి ఉంది. ఇప్పుడు కేకేఆరే గ్రీన్ కోసం ఆ రికార్డును అధిగమించింది. మొత్తం ఐపీఎల్ చరిత్రలో గ్రీన్ ధర మూడో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో రిషభ్ పంత్ రూ.27 కోట్లు, ల రెండో స్థానంలో శ్రేయస్ అయ్యర్ రూ.26.75 కోట్లు ఉన్నారు.
26 ఏళ్ల గ్రీన్ ఆల్ రౌండర్. గతంలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లలో ఆడిన అతను గాయం కారణంగా 2025 సీజన్‌కు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు పూర్తిగా ఫిట్ అయిన అతను కేకేఆర్ జట్టుకు ఆడనున్నాయి. సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2 కోట్ల సొంతంచేసుకుంది. పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ వంటి వారని టీములు వద్దనున్నాయి.
