కొడాలి నాని గుడివాడలో చాలా కాలం తర్వాత కనిపించారు. అది కూడా రాజకీయ కార్యక్రమంలో. కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా ఆయన తన సంతకం చేసి.. నేనున్నానని చెప్పడానికి గుడివాడ వచ్చారు. గతంలో సంతకాలు చేయడానికి గుండెకు పట్టీ పెట్టుకుని వచ్చేవారు. ఇప్పుడు ఆ పట్టీ కూడా లేదు. గుండె ఆపరేషన్ కారణంగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని ఇక నేరుగా రాజకీయాలు చేస్తానని కూడా చెప్పారు.
కొడాలి నాని ప్రభుత్వం మారగానే తీవ్ర సమస్యలు ఎదుర్కొంటారని అనుకున్నారు. కానీ ఆయన గుడివాడకు రాకుండా ఉండటంతో పాటు గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరి ..ఆపరేషన్ చేయించుకున్నారు. ముంబైకు ఎయిర్ లిఫ్ట్ చేసి మరీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. దీంతో ఆయన కోలుకున్నారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గుడివాడలో మళ్లీ కార్యక్రమాలు ప్రారంభించకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటానని హెచ్చరికలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆయన గుడివాడలో సంతకాల కార్యక్రమం చేపట్టడం హాట్ టాపిక్ గా మారింది.
రెడ్ బుక్ లో మొదటి పేరు కొడాలి నానితే ఉంటుందని టీడీపీ వర్గాలు చెబుతూ ఉంటాయి. ఆయన వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల పాటు లుచ్చా భాషే వాడారు. చంద్రబాబును ఒక్క దెబ్బతో చంపుతానని చాలెంజ్ కూడా చేశారు. అదే సమయంలో గుడివాడలో సుదీర్ఘంగా ఎమ్మెల్యేగా ఉండి చేసిన దోపిడీల కేసులూ చాలా ఉన్నాయి. కొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నా.. చాలా కేసులు ఇంకా.. విజిలెన్స్ రిపోర్టుల దగ్గరే ఉన్నాయి. కేసులు పెట్టి లోపలేయడానికి..ఆయనకు ఫిట్ నెస్ లేదని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు పూర్తి ఫిట్ నెస్లో కొడాలి రంగంలోకి దిగారు. ఇక సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
