జగన్ వెంటే ఉంటానన్న కోన

హైదరాబాద్: జగన్‌ నాయకత్వంలోనే కొనసాగుతామని, ఆయనను వదిలేది లేదని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి చెప్పారు. టీడీపీలోకి వెళుతున్నామంటూ ఎల్లో మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. మునిగిపోయే నావలాంటి టీడీపీలోకి ఎవరూ వెళ్ళరని, చంద్రబాబుకు బుద్ధి చెప్పటం ఖాయమని అన్నారు. కోన, ముస్తఫా ఇవాళ లోటస్ పాండ్‌లో జగన్‌ను కలిశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ చీప్ పాలిటిక్స్‌కు లొంగబోమని చెప్పారు. కూరగాయల బేరంలాగా రకరకాల ఆఫర్‌లు ఇస్తున్నారని, ఫలానా వ్యక్తి ఫోన్ చేశారని చెప్పటం సంస్కారం కాదని అన్నారు. బ్రాహ్మణ సామాజికవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇచ్చారని, వాటన్నిటినీ తాను ప్రభుత్వానికి గుర్తు చేస్తూనే ఉంటానని కోన చెప్పారు. వైసీపీ సింబల్‌పైన గెలిచిన తాము ప్రతిపక్షంగా ప్రభుత్వంపై పోరాడతామని అన్నారు. టీడీపీలో చేరబోతున్నట్లు బాగా ప్రచారం జరిగిన నేపథ్యంలో కోన రఘుపతి, ముస్తఫా ఈ వివరణ ఇచ్చినట్లు కనబడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close