కేజ్రీవాల్ పబ్లిసిటీ హడావుడికి కారణం అదా!

హైదరాబాద్: కొద్ది రోజులుగా మీడియాలో ఆమ్ ఆద్మీ పార్టీ పబ్లిసిటీ హడావుడి ఎక్కువైన సంగతి తెలిసిందే. దినపత్రికలలో ఎడాపెడా ఫుల్ పేజ్ ప్రకటనలతోపాటు, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా జోరుగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వ పాలనలో కరెంట్, వాటర్ బిల్లులు గణనీయంగా తగ్గిపోయాయని, ఆప్ పాలన అద్భుతంగా ఉందని ఆ ప్రకటనలలో చెప్పిస్తున్నారు. త్వరలో జరగబోయే తమిళనాడు, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసమే ఆప్ ఈ హడావుడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్‌లో ఎన్నికల ప్రచారానికి ఇప్పటికే శ్రీకారం చుట్టారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ పంజాబ్‌లో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుని ఉండటంతో(దేశం మొత్తానికి వచ్చింది ఆ నాలుగు సీట్లే) ఆ స్ఫూర్తితో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సత్తా చూపాలని ఆప్ ప్రయత్నిస్తోంది. కేజ్రీవాల్ తన ఐదు రోజుల పంజాబ్ పర్యటనలో భాగంగా నిన్న సంగ్రూర్, మాన్సా, తల్వాండి సాబో తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించారు. దుకాణాల యజమానులు, గ్రామస్తులతో మాట్లాడారు. తమకు అధికారం ఇస్తే పంజాబ్‌లోనూ ఢిల్లీ తరహా పాలన అందిస్తామని, అవినీతి భరతం పడతామని కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీలో గత ఏడాదికాలంలో నిజాయతీ ప్రభుత్వం పనితీరును అందరూ చవిచూశారని, పంజాబ్‌లో అధికారంలోకి వస్తే రెండు నెలల్లో అవినీతిని రూపుమాపుతామని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close