కొర‌టాల‌కు కోపం తెప్పించిన‌ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌

సినిమాకి సంబంధించిన ఎలాంటి స‌మాచారం అయినా స‌రే, గోప్యంగా ఉంచాల‌న్న‌ది ద‌ర్శ‌క నిర్మాత‌ల తాప‌త్ర‌యం. అన్నీ దాచి, దాచి… సినిమాలో చూపించి ప్రేక్ష‌కుల్ని థ్రిల్ చేయాల‌నుకుంటుంటారు.కానీ.. దుర‌దృష్ట‌వ‌శాత్తూ.. ఏదో రూపంలో బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంటాయి. తాజాగా… `ఆచార్య‌` సినిమాకి సంబంధించిన సెట్ విష‌యాలు, విశేషాలూ.. బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. దానికికార‌ణం చ‌ర‌ణ్ ఫ్యాన్సే.

`ఆచార్య‌`లో రామ్ చ‌రణ్ ఓ కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ షూటింగ్ లోనూ పాల్గొంటున్నాడు. ఇటీవ‌ల కొంత‌మంది చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌, చ‌ర‌ణ్ వ్య‌క్తిగ‌త సిబ్బంది, చ‌ర‌ణ్‌కి అత్యంత స‌న్నిహితులు.. `ఆచార్య‌` సెట్ కి వెళ్లి. చ‌ర‌ణ్‌కి క‌లుసుకున్నారు. చ‌ర‌ణ్ వాళ్ల‌తో కాసేపు గ‌డిపి, ఫొటోలు దిగి.. పంపాడు. అయితే,.. సెట్ కి వెళ్లిన చ‌ర‌ణ్ ఫ్యాన్స్ ఖాళీగా లేరు. అక్క‌డి ఫొటోల్ని తీసి.. సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. `ఆచార్య‌` కోసం వేసిన టెంపుల్ సెట్.. ఈ సినిమాకి చాలా ప్ర‌త్యేకం. ఆ సెట్ సింహ ద్వారాన్ని మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కూ చూపించారు. అదీ.. చిరంజీవి రివీల్ చేయ‌డం వ‌ల్లే చూడ‌గ‌లిగారు. అయితే ఇప్పుడు చ‌ర‌ణ్ ఫ్యాన్స్ వ‌ల్ల‌.. టెంపుల్ సెట్ లోని కీల‌క భాగాల‌న్నీ బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి.

ఇదంతా గ‌మ‌నించిన కొర‌టాల మ‌రుస‌టి రోజు `ఆచార్య‌` సెట్లో ఫైర్ అయిన‌ట్టు తెలుస్తోంది. గోప్యంగా ఉంచాల్సిన విష‌యాలు బ‌య‌ట‌కు ఎలా వ‌స్తున్నాయి? అంటూ సిబ్బందిని అడిగిన‌ట్టు తెలుస్తోంది. ఇక మీద‌ట‌ సెట్ లోకి ఇత‌రులెవ‌ర్నీ రానివ్వ‌కూడ‌ద‌ని గ‌ట్టిగా చెప్పాడ‌ట‌. చ‌ర‌ణ్ క‌ల‌గ‌చేసుకుని కొర‌టాల‌కు స‌ర్ది చెప్పాడ‌ట‌. ఇక నుంచి త‌న‌వాళ్ల‌కీ సెట్ లోకి ఎంట్రీ ఇవ్వొద్ద‌ని, ఇలాంటి విష‌యాల్లో మొహ‌మాటాల‌కు తావులేద‌ని చ‌రణ్ చెప్పాడ‌ట‌. అలా.. కొర‌టాల కూల్ అయ్యాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీలో తిరుగుబాటు వార్తలు..! సజ్జల వివరణ..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు అంటూ రిపబ్లిక్ టీవీలో వచ్చిన ఓ కథనం ఇప్పుడు వైసీపీలో అలజడి రేపుతోంది. ఎంతగా అంటే.. ఆ పార్టీకి జగన్ తర్వాత జగన్ అంతటి వ్యక్తిగా బరువు,...

స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆగదని కేంద్రంతో చెప్పించిన వైసీపీ ఎంపీలు..!

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి తమ వద్ద ప్రత్యేకమైన ప్రణాళిక ఉందని చెబుతున్న వైసీపీ నేతలు... ఢిల్లీ నుంచి మాత్రం ఏపీకి స్టీల్ ప్లాంట్‌తో సంబంధం లేదనే ప్రకటనలు...

తెలంగాణ మహిళల గురించి సరే….షర్మిల తన హక్కుల కోసం ఎలా పోరాడుతారు..!?

తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి.. రాజన్న రాజ్యం తీసుకు వచ్చి.. అందరికీ న్యాయం చేసేయాలన్న పట్టుదలతో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కూడా ఉపయోగించుకున్నారు. పెద్ద...

చంద్రబాబు బూతులు మాట్లాడుతున్నారంటున్న సజ్జల..!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాలు కానీ.. రాజకీయ విమర్శలు కానీ బూతుల రేంజ్‌లో ఎవరు చేస్తారు..? అంటే ప్రత్యేకంగా సమాధానం వెదుక్కోవాల్సిన అవసరం లేదు. అయితే అదే వైసీపీ నేతలు ఇప్పుడు.. చంద్రబాబు, లోకేష్...

HOT NEWS

[X] Close
[X] Close