రాజ‌కీయాల‌కు గుడ్ బై!

సినిమాల్లో ఓ వెలుగు వెలిగాక‌.. రాజ‌కీయాల‌వైపు అడుగెట్టాల‌ని, అక్క‌డా రాజ్య‌మేలాల‌న్న ఆశ చిగురిస్తుందేమో..? అందుకే కొంత‌మంది స్టార్లు… రాజ‌కీయాల‌వైపు అడుగులు వేశారు, వేస్తున్నారు. అయితే.. రాజ‌కీయాలు అంద‌రికీ అచ్చురావు. కొంత‌కాలం పోయాక‌, కొంత అనుభ‌వం గ‌డించాక గానీ, ఆ విష‌యం బోధ ప‌డ‌దు. చిరంజీవి గ‌త కొంత‌కాలం నుంచీ రాజ‌కీయాల‌పై విముఖంగానే ఉన్నారు. పార్ల‌మెంట్ స‌భ్యుడిగా ప‌నిచేసిన మురళీ మోహ‌న్ కూడా.. `రాజ‌కీయాలు మ‌న‌కెందుకు లెండి..` అంటూ నిరాశక్త‌త ప్ర‌ద‌ర్శిస్తున్నారు. రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పేశారు.

న‌టుడిగా, నిర్మాత‌గా, వ్యాపార వేత్త‌గా కొంత పేరు గ‌డించిన ముర‌ళీమోహ‌న్ – ఆ త‌ర‌వాత‌.. రాజ‌కీయాల్లోనూ చేరారు. తెలుగుదేశం పార్టీ త‌ర‌పున క్రియాశీల‌కంగా ప‌నిచేశారు. రాజ‌మండ్రి నుంచి పార్ల‌మెంటు అభ్య‌ర్థిగా పోటీ చేసి ఓ సారి ఓడిపోయారు. మ‌రోసారి గెలిచారు. గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయాక‌.. ఆయ‌న రాజ‌కీయంగా పూర్తిగా సైడ్ అయిపోయారు. అస‌లు ఆయ‌న నోటి నుంచి రాజ‌కీయాల మాటే రావ‌డం లేదు. ఇప్పుడు ఏకంగా రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పేశారు. ఇటీవ‌ల ముర‌ళీ మోహ‌న్ అనారోగ్యం పాల‌య్యారు. ఆప‌రేష‌న్ కూడా జ‌రిగింది. ఆరోగ్య కార‌ణాల రీత్యా.. రాజ‌కీయాలకు దూర‌మ‌య్యానంటున్న ముర‌ళీ మోహ‌న్‌.. ఇప్పుడు సినిమాల‌పై దృష్టి పెడుతున్నారు. `అత‌డు` లాంటి సినిమాల్ని అందించిన జ‌య‌భేరి సంస్థ నుంచి కొత్త సినిమాల్ని రూపొందించ‌డానికి క‌స‌ర‌త్తులు చేస్తున్నార్ట‌. అంతేకాదు.. న‌టుడిగానూ మ‌ళ్లీ బిజీ అవ్వాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఆర్కా మీడియా రూపొందిస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో కీల‌క పాత్ర పోషిస్తున్నారు ముర‌ళీ మోహ‌న్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీలో తిరుగుబాటు వార్తలు..! సజ్జల వివరణ..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు అంటూ రిపబ్లిక్ టీవీలో వచ్చిన ఓ కథనం ఇప్పుడు వైసీపీలో అలజడి రేపుతోంది. ఎంతగా అంటే.. ఆ పార్టీకి జగన్ తర్వాత జగన్ అంతటి వ్యక్తిగా బరువు,...

స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆగదని కేంద్రంతో చెప్పించిన వైసీపీ ఎంపీలు..!

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి తమ వద్ద ప్రత్యేకమైన ప్రణాళిక ఉందని చెబుతున్న వైసీపీ నేతలు... ఢిల్లీ నుంచి మాత్రం ఏపీకి స్టీల్ ప్లాంట్‌తో సంబంధం లేదనే ప్రకటనలు...

తెలంగాణ మహిళల గురించి సరే….షర్మిల తన హక్కుల కోసం ఎలా పోరాడుతారు..!?

తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి.. రాజన్న రాజ్యం తీసుకు వచ్చి.. అందరికీ న్యాయం చేసేయాలన్న పట్టుదలతో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కూడా ఉపయోగించుకున్నారు. పెద్ద...

చంద్రబాబు బూతులు మాట్లాడుతున్నారంటున్న సజ్జల..!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాలు కానీ.. రాజకీయ విమర్శలు కానీ బూతుల రేంజ్‌లో ఎవరు చేస్తారు..? అంటే ప్రత్యేకంగా సమాధానం వెదుక్కోవాల్సిన అవసరం లేదు. అయితే అదే వైసీపీ నేతలు ఇప్పుడు.. చంద్రబాబు, లోకేష్...

HOT NEWS

[X] Close
[X] Close