క్రిష్‌… మ‌ళ్లీ అదే దారిలో!

క్రిష్ మంచి సినిమాలు తీశాడు. ఓ గమ్యం, ఓ వేదం, ఓ కృష్ణం వందే.. ఓ కంచె… అన్నీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న చిత్రాలే. కానీ వాటిలో క‌మ‌ర్షియల్ విలువ‌లు చాలా త‌క్కువ‌. ఆ మాట‌కొస్తే లేవు కూడా. క్రిష్ సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ గా హిట్ అయిన దాఖాలాలు లేవు. దాంతో క్రిష్ లోనూ కాస్త అల‌జ‌డి రేగింది. `ఎన్టీఆర్‌` బ‌యోపిక్‌లు నేర్పిన పాఠ‌మో ఏమో, `ఈసారి క‌మ‌ర్షియ‌ల్ సినిమా తీస్తా` అని డిసైడ్ అయిపోయాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో తీస్తున్న సినిమాలో క‌మ‌ర్షియ‌ల్ హంగులు చాలా ఉన్నాయి. ఇది క్రిష్ త‌న‌ని తాను మార్చుకుంటూ తీస్తున్న సినిమా.

అయితే అనుకోకుండా ప‌వ‌న్ సినిమాకి బ్రేక్ ప‌డింది. క్రిష్ ఖాళీ అయ్యాడు. ఈ స‌మ‌యాన్ని మ‌రో సినిమా కోసం వెచ్చించాడు. వైష్ణ‌వ్ తేజ్ తో ఓ సినిమా మొద‌లెట్టాడు. షూటింగ్ చ‌క చ‌క సాగుతోంది. స‌న్న‌పురెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి రాసిన `కొండ‌పొలెం` న‌వ‌ల ఈ చిత్రానికి ఆధారం. తానా వారి పోటీల్లో 2 ల‌క్ష‌ల బ‌హుమ‌తి గెలుచుకున్న న‌వ‌ల అది. ఈ న‌వ‌ల చ‌దివిన‌వాళ్లంద‌రికీ `ఇది సినిమాగా తీస్తే.. వ‌ర్క‌వుట్ అవుతుందా` అనే సందేహం రాక మాన‌దు. ఎందుకంటే.. ఆ న‌వ‌ల నేప‌థ్యం, న‌డిచిన తీరు అలా ఉంటుంది.

‌నల్లమల అడవుల చుట్టుపక్కల గ్రామాల్లో వర్షాభావం చేత గొర్రెలకు తినడానికి మేత, తాగటానికి నీరు లేనప్పుడు, వర్షాలు పడేవరకు తమ గొర్రెలని బతికించుకోవటం కోసం గొర్రెలకాపరులు అడవిబాట పడతారు. మళ్లీ తమ ఊరిలో వానలు పడి గొర్రెలకు నీరు, మేత దొరికే వరకు అడవుల చుట్టూ సంచరిస్తుంటారు. ఇలా చేసే వనవాసాన్ని స్థానికులు కొండపొలం వెళ్లటం అని వ్యవహరిస్తారు. ఇదే ఈ సినిమాకు మూలం. ఈ జీవ‌న విధానం చాలామందికి తెలీదు. వాళ్లంతా ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారా? అనిపిస్తోంది. పైగా హీరోయిజ‌మో, మ‌రోటో చూపించేందుకు ఆస్కారం ఉన్న క‌థ కాదిది. క్రిష్ ఈ న‌వ‌ల‌ని సినిమాటిక్ గా మార్చుకుంటే త‌ప్ప‌, క‌మ‌ర్షియ‌ల్ విలువ‌లు అబ్బ‌వు. కానీ క్రిష్ ఆ త‌ర‌హా ద‌ర్శ‌కుడు కాదు. న‌వ‌ల లో ఆత్మ‌ని చెడ‌గొట్ట‌డం ఏమాత్రం ఇష్టం ఉండ‌దు. కాబ‌ట్టి క‌మ‌ర్షియ‌ల్ హంగుల జోలికి పోడు కూడా. న‌వ‌ల‌లో స‌న్నివేశాలు లేదు. సంభాష‌ణ‌లు సైతం… ఉన్న‌ది ఉన్న‌ట్టుగా వాడుకుంటున్నాడ‌ని స‌మాచారం. కాబ‌ట్టి.. ఇదీ దీన్నీ ఓ ప్ర‌యోగంగానే భావించాల్సిందే. అయితే ఈసారి క్రిష్ కి అండ‌గా ఓటీటీ వేదిక ఉంది. ఈ సినిమా ఓటీటీ కోస‌మే తీస్తున్నాడ‌ని ఓ టాక్ వినిపిస్తోంది. ఎంత ప్ర‌యోగ‌మైనా, ఓటీటీ సినిమా అయినా ఈ ప్ర‌భావం ప‌వ‌న్ సినిమాపై లేకుండా చూసుకోవాలి. క్రిష్ ముందున్న అస‌లైన స‌వాల్ అదే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : టీవీ9 నుంచి రజనీకాంత్ ఔట్

టీవీ9 నుంచి రజనీకాంత్ నిష్క్రమించారు. తెలుగులో నెంబర్ వన్ చానల్‌గా ఉన్న టీవీ9లో కొద్దిరోజులుగా గ్రూపుల గలాటా సాగుతోంది.రజనీకాంత్, మురళీకృష్ణల మధ్య సిబ్బంది రెండు వర్గాలుగా విడిపోయారు. కొత్త యాజమాన్యం చేతుల్లోకి వచ్చిన...

అమరావతికి మద్దతుగా హైకోర్టులో జనసేన అఫిడవిట్..!

అమరావతి విషయంలో జనసేన పార్టీ తన విధానాన్ని నేరుగా హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో తెలియ చేసింది. మూడు రాజధానులు వద్దే వద్దని అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని సూటిగా జనసేన స్పష్టం చేసింది....

బ్యాటన్ అందుకున్న రోజా ..! పెద్ద ప్లానే..!?

హిందూత్వాన్ని కించ పరుస్తున్నారని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు మాత్రం తగ్గడం లేదు. వివాదాన్ని అంతకంతకూ పెద్దగి చేసుకుంటూ వెళ్తున్నారు అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలతో ఒకరిని మించి మరొకరు...

మోడీ భార్యతో కలిసి పూజలు చేసిన తర్వాతే జగన్‌ను అడగాలి : కొడాలి నాని

భారతీయ జనతా పార్టీపైనా మంత్రి కొడాలి నాని తన టెంపర్ చూపించారు. ప్రధాని మోడీ ముందు తన భార్యను రామాలయనికి తీసుకెళ్లి సతీసమేతంగా పూజలు చేయాలని ఆ తర్వాతే జగన్మోహన్ రెడ్డి కుటుంబసమేతంగా...

HOT NEWS

[X] Close
[X] Close