బాల‌య్య కోసం క్రిష్ త్యాగం

‘ఎన్టీఆర్’ బ‌యోపిక్ క్రిష్‌చేతికి వెళ్ల‌డం దాదాపుగా ఖాయ‌మైపోయిన‌ట్టే. ఇందుకు సంబంధించి… చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ‘మ‌ణిక‌ర్ణిక‌’ సినిమా ప‌నుల్లో క్రిష్ ముంబైలో బిజీగా ఉన్నారు. ఒక‌ట్రెండు రోజుల్లో ఆయ‌న హైద‌రాబాద్ వ‌స్తారు. రాగానే… ‘ఎన్టీఆర్‌’ బ‌యోపిక్‌పై ఓ అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది. ‘ఎన్టీఆర్’ బ‌యోపిక్ చేయ‌డానికి క్రిష్‌రెడీగానే ఉన్నాడు. కాక‌పోతే… త‌న‌కు బాలీవుడ్ లో మ‌రో క‌మిట్‌మెంట్ ఉంది. ఆగ‌స్టులో హిందీలో ఓ సినిమా ప్రారంభించాల్సివుంది క్రిష్‌. ఇప్పుడు దాన్ని పోస్ట్ పోన్ చేసుకునే బిజీలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఒక‌వేళ క్రిష్ ‘ఎన్టీఆర్’ బ‌యోపిక్‌కి ఓకే అంటే.. ఆ ప‌నులు వెంట‌నే ప్రారంభం అవ్వాలి. 2019 సంక్రాంతికి బ‌యోపిక్ ప్రేక్ష‌కుల ముందుకు రావాలి. అప్ప‌టి వ‌ర‌కూ హిందీ సినిమాని పక్క‌న పెట్టాల్సివ‌స్తోంది. క్రిష్‌కి ముందు నుంచీ బాలీవుడ్ అంటే మోజు. అక్క‌డ సినిమా తీసి హిట్టు కొడితే.. అంత‌ర్జాతీయంగా నిల‌బ‌డి పోవొచ్చు. అందుకే హిందీలో అడ‌పా ద‌డ‌పా ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. బాల‌య్య కోసం అక్క‌డి నుంచి వ‌చ్చిన ఆఫ‌ర్‌ని ఇప్పుడు ప‌క్క‌న పెట్టాల్సివ‌స్తోంది. పెడితే పెట్టాడు. ‘ఎన్టీఆర్‌’ బ‌యోపిక్ తీయ‌డానికి క్రిష్ స‌మ‌ర్థుడు. ప‌రిమిత వ‌న‌రుల‌తో ‘గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి’ని ఎంత మ‌నోరంజ‌కంగా తీశాడో క‌దా? ఆ అనుభ‌వం ఇప్పుడు బాల‌య్య‌కు, ఎన్టీఆర్ బ‌యోపిక్‌కీ అవ‌స‌రం కూడానూ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com