భాజ‌పాపై మ‌న నేత‌లు ఇలా స్పందించ‌రేం..?

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌… వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్ర‌స్తుతానికి పార్టీ పెట్ట‌లేదుగానీ, దానికి కావాల్సిన పునాదుల్ని బ‌లంగా నిర్మించుకుంటున్నారు. ఇటీవలే అధికార పార్టీ చేయించిన ఓ ర‌హ‌స్య స‌ర్వేలో ర‌జినీకి దాదాపు 150 స్థానాల్లో అనూహ్య మ‌ద్ద‌తు ల‌భిస్తోంద‌ని తేలింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఉన్న‌వారు.. ‘రేప్పొద్దున్న ఏ పార్టీతో పొత్తు పెట్టుకుందాం, ప‌రిస్థితులు ఎట్నుంచి ఎటుమార‌తాయో తెలీదు కాబట్టి, ఎవ‌ర్నీ ఏదీ విమ‌ర్శించ‌కుండా మౌనంగానే ఉంటేనే బెట‌ర్’ అని ఆలోచిస్తారు! వాస్త‌వ ప‌రిస్థితుల‌పై కూడా స్పందించ‌లేరు. కానీ, క‌ర్ణాట‌క తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌పై రజినీకాంత్ సూటిగా స్పందించారు. భాజ‌పాపై ఘాటుగా విమ‌ర్శ‌లు చేశారు.

క‌ర్ణాట‌క‌లో చోటు చేసుకున్న ప‌రిణామాలు ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం పాలుచేసేవిగా ఉన్నాయ‌న్నారు. బ‌ల‌ప‌రీక్ష‌కు 15 రోజులు కావాలంటూ గ‌వ‌ర్న‌ర్ ను భాజ‌పా కోర‌డం హాస్యాస్ప‌దం అన్నారు. ప్ర‌జాస్వామ్యానికి మ‌ద్ద‌తుగా సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వ‌డం మంచి ప‌రిణామమ‌ని చెప్పారు. బ‌ల‌ప‌రీక్ష‌కు ముందే ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి ఎడ్యూర‌ప్ప రాజీనామా చేయడాన్ని ప్ర‌జ‌స్వామ్యం గెలుపుగా ర‌జినీకాంత్ అభివ‌ర్ణించారు.

క‌ర్ణాట‌క ప‌రిణామాల‌పై ఏపీ నేత‌లు ఇంత సూటిగా స్ప‌ష్టంగా స్పందించారా..? క‌ర్ణాట‌క‌లో రాజ్యాంగం గెలిచింద‌ని మొద‌లుపెట్టి… టీడీపీ మీద విమ‌ర్శ‌ల దాడికే ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ప‌రిమిత‌మ‌య్యారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై భాజ‌పాపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయ‌న్నారు! నిజానికి, ఆడియో టేపులు కూడా బ‌య‌ట‌కి వ‌చ్చాయి. భాజ‌పా నేత‌ల తీరు బ‌హిర్గ‌త‌మై చ‌ర్చ జ‌రిగినా జ‌గ‌న్ ఆ ఊసే ఎత్తలేదు. ఇక‌, క‌ర్ణాట‌క ప‌రిణామాల‌పై ప‌వ‌న్ మాట్లాడుతూ… ఎమ్మెల్యేలు కొనుగోలు చేయ‌ని పార్టీలు ఏవైనా ఉన్నాయా..? భాజ‌పా ఒక్క‌టే కాదు.. అంద‌రూ అదే ప‌ని చేస్తున్నార‌నీ, మ‌రొక‌రిని ప్ర‌శ్నించి, వేలెత్తి చూపే స్థాయిల్లో ఎవ్వ‌రూ లేర‌ని అన్నారు. దేశ‌వ్యాప్తంగా భాజ‌పా చేస్తున్న రాజ‌కీయంపై తీవ్ర‌మైన వ్య‌తిరేక వ్య‌క్త‌మైనా… భాజపాని నేరుగా, సూటిగా విమ‌ర్శించేందుకు మ‌న నాయ‌కులు సాహ‌సించ‌రు ఎందుకో మ‌రి..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

ప్రచారంలో పొలిటికల్ గ్లామర్ ఏదీ..?

ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close