చెన్నై , ఆంధ్రప్రదేశ్‌ వరద బాధితులకు విరాళం ప్రకటించిన కృష్ణంరాజు, ప్రభాస్‌

భారీ వర్షాల కారణంగా తమిళనాడులోని 9 జిల్లాలు వరద తాకిడికి గురైన విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా చెన్నై పట్టణం ముంపుకు గురి కావడం, కొంతమంది ప్రాణాలు కోల్పోవడం, ఎంతో మంది నిరాశ్రయులు కావడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు చెందిన వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు, యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ కలిసి వరద బాధితులకు 15 లక్షల రూపాయల విరాళాన్ని అందిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ మొత్తాన్ని అందజేస్తారు.

ఆంధ్రప్రదేశ్‌కు రూ.5 లక్షలు

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు జిల్లాలు ఈ వరదల తాకిడికి గురయ్యాయి. ప్రాణ నష్టంతోపాటు ఆస్తి నష్టం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ వరద బాధితుల సహాయార్థం యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ రూ. 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి అందించనున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com