‘పెద్ది’ రన్ టైమ్ 3 గంటల 3 నిమిషాలు. ఓరకంగా పెద్ద సినిమానే. రిలీజ్ అయిన తరవాత జాన్వీ కపూర్‌కు సంబంధిచిన కొన్ని సన్నివేశాల్ని ట్రిమ్ చేయాల్సివచ్చింది. దాంతో లెంగ్త్ కొంత తగ్గింది. త్వరలో ‘పెద్ది’ ఓటీటీలోకి రాబోతోంది. ఈసారి ఓటీటీ ప్రేక్షకుల కోసం పెద్ది టీమ్ కొత్త స్ట్రాటజీ అప్లై చేస్తోంది. వాళ్ల కోసం కొత్త సన్నివేశాలు జోడించబోతోంది. దాంతో మరో 20 నిమిషాల రన్ టైమ్ పెరగబోతోంది. ఇప్పుడు ‘పెద్ది’ ఓటీటీ లెంగ్త్ 3 గంటల 25 నిమిషాల పైమాటే.
రామ్ చరణ్ – జగపతిబాబు అనుబంధాన్ని ఎలివేట్ చేస్తూ కొన్ని సీన్లు తీశాడు బుచ్చిబాబు. అయితే ఎడిటింగ్ టేబుల్ దగ్గర వాటికి కత్తెర పడింది. ఈ విషయంలో జగపతిబాబు కూడా బుచ్చిబాబుపై అలిగాడని టాక్. ”సినిమా లెంగ్త్ ఎంతున్నా ఫర్వాలేదు. ఎమోషన్ క్యారీ చేసే సన్నివేశాల్ని తొలగించకూడదు” అని బుచ్చిబాబుకి చెప్పాడట. కానీ అప్పటికే సినిమా రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు వాటిని ఓటీటీ కోసం కలపబోతున్నారు.
అంతే కాదు… శివరాజ్‌కుమార్ – చరణ్ మధ్య తెరకెక్కించిన కొన్ని సీన్లకూ కత్తెర్లు పడ్డాయి. వాటినీ ఇప్పుడు కలపబోతున్నారు. ఈ 20 నిమిషాల ఫుటేజీ వల్ల థియేటర్లో చూసిన ప్రేక్షకులు కూడా ఓటీటీలోకి వచ్చాక మళ్లీ చూస్తారు. ఓటీటీ వ్యూవర్స్ ఎలాగూ ‘పెద్ది’ సినిమాని చూడ్డానికి రెడీగా ఉన్నారు. సో.. వ్యూవర్ షిప్ బాగా పెరిగే అవకాశం ఉంది.
నెట్ ఫ్లిక్స్ సంస్థ ‘పెద్ది’ ఓటీటీ హక్కుల్ని కైవసం చేసుకొంది. రూ.55 కోట్ల బేస్ రేట్ కు ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఆ తరవాత బాక్సాఫీసు దగ్గర వసూలు చేసిన ప్రతీ వంద కోట్లకూ రూ.30 కోట్లు చెల్లించనుంది.
