మేడా వైసీపీలో చేరిక వెనుక కేటీఆర్..!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యక్ష రాజకీయాల్లో వేలు పెడతామని ప్రకటించిన కేటీఆర్.. అందులో భాగంగా.. వైసీపీలో చేరికల్ని ప్రొత్సహిస్తున్నారా..? అంటే.. అవుననే అంటున్నారు.. వైసీపీ నేతలు. తెలుగుదేశం పార్టీని విడిచి పెట్టాలా వద్దా… అని ఊగిసలాడుతున్న రాజంపేట ఎమ్మెల్యేను ఆయన బంధువులను స్వయంగా పిలిపించుకుని.. కేటీఆర్ తన సమక్షంలో చర్చలు జరిపి.. వైసీపీలో చేరికకు మార్గాన్ని సుగమం చేశారంటున్నారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డికి… వైసీపీలో చేరాలని లేదు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఆరు నెలల కిందటి వరకూ బాగానే ఉన్నారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు మంజూరు చేయించుకున్నారు. కడప జిల్లాలో టీడీపీ తరపున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే కాబట్టి.. చంద్రబాబు కూడా దాదాపుగా రూ. 800 కోట్లు నియోజకవర్గ అభివృద్ధికి ఇచ్చారు. ఈ విషయాన్ని మేడానే.. లోటస్ పాండ్ లోనే మీడియాకు చెప్పారు.

కానీ ఆయన సోదరుడు.. మేడా రఘునాథరెడ్డికి కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఉంది. ఈ వ్యవహారాలన్నీ ఆయనే చూస్తూంటారు. ఇటీవలి కాలంలో తెలంగాణలో ఆయన సోదరుడు.. పలు కాంట్రాక్టులు పొందారు. నల్లగొండ జిల్లాలో కొన్ని కీలకమైన ప్రాజెక్టులను.. మేడా కుటుంబానికి చెందిన కంపెనీ చేపట్టింది. ఈ కోణంలో.. కేటీఆర్, మేడా సోదరుడు మధ్య పరిచయడం పెరిగింది. ఆ తర్వాతే .. వారు .. వైసీపీలో చేరాలనే ఆలోచన చేయడం ప్రారంభించారు. పిలిచి టిక్కెట్ ఇచ్చిన టీడీపీని వీడటం మల్లిఖార్జునరెడ్డికి ఇష్టం లేకపోయినా.. సోదరుడి మాట కాదనలేక.. పార్టీ మారిపోవాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున ఆయన సోదరుడు రఘునాథరెడ్డి పోటీ చేస్తారని చెబుతున్నారు.

ఇంత వరకూ బాగానే ఉన్నా… మేడా చేరిక చర్చలు.. కేటీఆర్ సమక్షంలో ఎందుకు జరపాల్సి వచ్చిందంటే… వారి చేరిక.. జగన్‌కు పెద్దగా ఇష్టం లేదంటున్నారు. ఎందుకంటే.. అక్కడ.. వైసీపీ జిల్లా అధ్యక్షుడు… టిక్కెట్ రేసులో ఉన్నారు. వైఎస్ కుటుంబానికి మొదటి నుంచి అండగా ఉన్న వ్యక్తి ఆకేపాటి అమరనాథ్ రెడ్డి. ఆయన రెండు సార్లు రాజంపేట నుంచి గెలిచారు. గత ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. మేడాకు.. ఆయనకు పొసగనే పొసగదు. ఆయనను కాదనలేని పరిస్థితుల్లో మేడా సోదరుల రాకను.. జగన్ లైట్ తీసుకున్నారు. కానీ కేటీఆర్ ఒత్తిడితో పార్టీలో చేర్చుకోక తప్పలేదంటున్నారు. మరి ఆకేపాటిని ఇప్పుడు జగన్ బుజ్జగిచాల్సి ఉంది. లేకపోతే.. సొంత పార్టీలోనే చిచ్చు పెట్టుకున్నట్లు అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close