లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
ఎడ్ల రాహుల్ రావు ఎవరో కాదు..కేటీఆర్ భార్య శైలిమ సోదరుడే ఈ రాహుల్ రావు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకొని రాహుల్ రావు అవినీతికి పాల్పడ్డాడని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే, బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే ఆయన కాంగ్రెస్ లో చేరడం చర్చనీయాంశం అవుతోంది. ఆయనను కాంగ్రెస్ లో చేరాలని ఎవరైనా పురమాయించారా..? లేక కేటీఆర్ పై అసంతృప్తితోనే కాంగ్రెస్ గూటికి చేరారా.? అనేది బిగ్ డిబేట్ గా మారింది. గత కొన్నాళ్ళుగా కేటీఆర్ – రాహుల్ రావు మధ్య విబేధాలు ఉన్నాయనే ప్రచారం నేపథ్యంలో తాజాగా మైనంపల్లి హన్మంత రావు చొరవతో రేవంత్ సమక్షంలో రాహుల్ కాంగ్రెస్ లో చేరినట్లుగా తెలుస్తోంది.
వరుసగా పార్టీని వీడుతున్న నేతలను కేటీఆర్ నిలువరించలేక వారిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పుడు సొంత బావమరిది కాంగ్రెస్ లో చేరిక కేటీఆర్ కు ఇబ్బందికరమే. కాంగ్రెస్ లో చేరకుండా సొంత బావమరిదిని నిలువరించలేని కేటీఆర్.. పార్టీని ఏం కాపాడుతాడు అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.