బీఆర్ఎస్‌లో లోకల్ వార్ – పట్టించుకోని కేటీఆర్ !

బీఆర్ఎస్ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పుడు ఫైట్ మోడ్‌లో ఉన్నారు. స్థానిక పదవుల కోసం పార్టీ ఎటు పోతే మాకేంటి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా మున్సి పాలిటీ-లు, నగర పంచాయ తీలు, మేజర్‌ గ్రామ పంచా యతీల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా అవిశ్వాసాలే కనిపిస్తున్నాయి. గత నెల రోజులుగా స్థానిక సంస్థల్లో అవిశ్వాసాల అలజడి కొనసాగుతోంది.

పురపాలక చట్టం ప్రకారం ఎన్నికల పక్రియ పూర్తి అయిన మూడేళ్ళ వరకు ఎలాంటి అవిశ్వాస తీర్మానాలకు అవకాశం లేదు. ఆ మూడేళ్ల కాలపరిమితి ఇప్పుడు ముగిసింది. దీంతో ఇప్పటి వరకూ ఓపిక పట్టిన వారు రాజకీయం ప్రారంభించారు. ఆయా నియోజకవర్గా లకు బాధ్యతల్లో ఉన్న రాష్ట్రస్థాయి కీలక నేతలకు ఇది గడ్డు కాలంగా కనిపిస్తోంది . మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లపై అవిశ్వాసం పెట్టొద్దని కేటీఆర్‌ ఆదేశించినప్పటికీ.. సొంత పార్టీ కార్పొ రేటర్లు, కౌన్సిలర్లు పట్టించుకోవడం లేదు. కేటీఆర్ కూడా ఓ మాట చెప్పి ఊరుకున్నారు.

అన్ని చోట్లా పదుల సంఖ్యలో అవిశ్వాస తీర్మానాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో అవిశ్వాసం ప్రక టిస్తున్న వారు కూడా పట్టుదలగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రతినిధుల మద్దతు అధికార పార్టీకి అవసరం కనుక, తమ డిమాండ్‌ను తప్పక అంగీకరిస్తుందన్న నమ్మ కంతో వారున్నారు ! ఈ వివాదం మరింత ముదరకుండా వెంటనే పరిష్కరించాల్సిందిగా అధికార పార్టీ మంత్రులు, ఎమ్మె ల్యేలపై ఒత్తిడి తెస్తున్నారు.

కానీ చాలా చోట్ల వారే ఈ అవిశ్వాశాలకు కారణం అవుతున్నారు. మరో వైపు బీఆర్ఎస్ పెద్దలు ఓ మాట చెప్పి ఊరుకుంటున్నారు. వారు కూడా తాము వర్గం వైపు ఉండలేమనట్లుగా ఉంటున్నారు కానీ.. పార్టీని చక్కదిద్దాలని ఆలోచన చేయడం లేదు . దీంతో అవిశ్వాసాల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఇది పార్టీల రెండు, మూడు గ్రూపుల్ని తయారు చేసి అంతిమంగా పార్టీకి నష్టం చేస్తుందన్న ఆందోళన ఆ పార్టీలో వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close