తెలంగాణను ఏఐ క్యాపిటల్ మార్చేందుకు రేవంత్ ప్రభుత్వం ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకుంటోందని కేటీఆర్ సర్టిఫికెట్ ఇచ్చారు. కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. త్వరలో ఇండియాలో కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లుగా ఓపెన్ఏఐ వ్యవస్థాపకుడు శామ్ అల్టమన్ ట్విట్టర్ లో ప్రకటించారు. కేటీఆర్ వెంటనే ఆయనను హైదరాబాద్ కు ఆహ్వానించారు. హైదరాబాద్ సరైన డెస్టినేషన్ అవుతుందని.. హైదరాబాద్ ఉన్న ప్రత్యేకతలు, ఇక్కడ ఉన్న ప్రపంచప్రసిద్ధ కార్యాలయాల గురించి చెప్పారు.
అంత వరకూ బాగానే ఉంది కానీ.. తాను ప్రభుత్వం లాగా ఆహ్వానించడం లేదని .. తమది మాజీ ప్రభుత్వమని సంకేతాలు ఇవ్వాలి కాబట్టి .. తమ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా.. తెలంగాణను ఏఐ క్యాపిటల్ గా మార్చేందుకు ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయన్నారు. తాము 2020ను ఏఐ ఇయర్ గా ప్రకటించి చాలా కీలక నిర్ణయాలను తీసుకున్నామని గుర్తు చేసుకున్నారు.
హైదరాబాద్ కోసం కేటీఆర్ మంచి ప్రయత్నం చేశారు. తాను అధికారంలో లేకుండా తెలంగాణ కోసం.. హైదరాబాద్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయంగా ఎన్ని విబేధాలున్నా.. రాష్ట్రానికి మేలు జరిగే అంశంలో.. పెట్టుబడులు వచ్చే అంశంలో కేటీఆర్ తన వంతు సాయం చేస్తున్నారు. గుడ్డిగా వ్యతిరేకించడం ఉండదని.. పొలిటికల్ పాలసీలు ఎలాంటి సమస్యలు తీసుకు రావని ఆటోమేటిక్ గా సందేశం ఇస్తున్నారు. అదే ఏపీలో అయితే.. ఇస్తామంటే రావొద్దు అని మెయిల్స్ పెట్టె రాజకీయం నడుస్తూంటుంది. కానీ తెలంగాణలో మాత్రం భిన్నం.