లచ్చిందేవికి ఓ లెక్కుంది రివ్యూ – ప్రేక్షకుడికి తిక్క ఎక్కుతుంది

మయూఖ క్రియేషన్స్‌ : లచ్చిందేవికి ఓ లెక్కుంది

నటీనటులు: నవీన్‌చంద్ర, లావణ్య త్రిపాఠి, జె.పి.,
అజయ్‌, బ్రహ్మాజీ, భద్రం, సంపూర్ణేష్‌బాబు తదితరులు
సినిమాటోగ్రఫీ: ఈశ్వర్‌
సంగీతం: యం.యం.కీరవాణి
ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాత: సాయిప్రసాద్‌ కామినేని
రచన, దర్శకత్వం: జగదీష్‌ తలశిల
విడుదల తేదీ: 29.01.2016

అందాల రాక్షసి’ జోడీ నవీన్‌చంద్ర, లావణ్య తిప్రాఠి జంటగా, రాజమౌళి శిష్యుడు జగదీష్‌ తలశిల ను దర్శకుడుగా పరిచయం చేస్తూ సాయిప్రసాద్‌ కామినేని నిర్మించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో సినిమాగా ప్రమోట్‌ అవుతున్న ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి లచ్చిందేవి లెక్క సరిపోయిందా? ఈ సినిమాని ప్రేక్షకులు లెక్కలోకి తీసుకున్నారా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథ:

నవీన్‌(నవీన్‌ చంద్ర) జనతా బ్యాంక్‌లో ఓ చిన్న ఉద్యోగి. అదే బ్యాంక్‌లో క్యాషియర్‌గా పనిచేస్తుంటుంది దేవి(లావణ్య త్రిపాఠి). ఇద్దరూ ఒకే అపార్ట్‌మెంట్‌లో వుంటున్నా నవీన్‌ అంటే దేవికి మంచి అభిప్రాయం వుండదు. దానికి తగ్గట్టుగానే అతని బిహేవియర్‌ కూడా వుంటుంది. ఏదో విధంగా డబ్బు సంపాదించెయ్యాలన్న ఆశతో వుంటాడు నవీన్‌. ఓరోజు అనుకోకుండా అతని ఎకౌంట్‌లో మహేష్‌ పేరుతో లక్ష రూపాయలు డిపాజిట్‌ అవుతాయి. అవి ఎవరు వేశారో కనుక్కోకుండానే వాటిని ఖర్చు చేసేస్తాడు. ఆ తర్వాత నవీన్‌ని తన దగ్గరకు పిలిపించుకుంటాడు మహేష్‌. ప్రస్తుతం దేశంలో అన్‌క్లైయిమ్డ్‌ ఎకౌంట్స్‌ బ్యాంకుల్లో ఎన్ని వున్నాయనే దానిపై ఎంక్వయిరీ జరుగుతోందని, అది జనతా బ్యాంక్‌ వరకూ రాలేదని, అన్‌క్లైయిమ్డ్‌ ఎకౌంట్స్‌కి సంబంధించిన డేటా మొత్తం తనకి తెచ్చివ్వమని నవీన్‌కి ఆర్డర్‌ వేస్తాడు మహేష్‌. డేటా వుండే రూమ్‌లోకి బ్యాంక్‌ మేనేజర్‌ సోమయాజులు(జె.పి.)కి, దేవికి తప్ప ఎవరికీ ఎంట్రీ వుండదు. అందుకని దేవిని లైన్‌లో పెట్టి ఆ డేటా సంపాదిస్తాడు నవీన్‌. దాని ఆధారంగా మహేష్‌, అతని ప్రియురాలు జ్యోతి రెండు ఎకౌంట్స్‌లోని కోట్ల డబ్బును క్లైయిమ్‌ చేసుకోవడానికి నవీన్‌ సహకారంతో బ్యాంక్‌కి వెళ్తారు. ఆ డబ్బుని డ్రా చేసుకోవడంలో మహేష్‌, జ్యోతి సక్సెస్‌ అయ్యారా? వారికి సహకరించిన నవీన్‌ దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్‌ చేశాడు? ఈ డబ్బుకి, దేవికి ఏమైనా సంబంధం వుందా? ఈ కథ చివరికి ఎన్ని మలుపులు తిరిగింది? ఈ కథలో ఎన్ని ట్విస్టులు వున్నాయి? అనేది మిగతా కథ.

నటీనటుల పెర్‌ఫార్మెన్స్‌:
ఈ సినిమాలో కనిపించే క్యారెక్టర్లు చాలా తక్కువ. నవీన్‌గా చేసిన నవీన్‌ చంద్ర పెర్‌ఫార్మెన్స్‌ చాలా సోసోగా వుంది. మంచి పెర్‌ఫార్మెన్స్‌ చేసే అవకాశం అతని క్యారెక్టర్‌ ఇవ్వలేదనేది అర్థమవుతుంది. ఇక లావణ్య త్రిపాఠి దేవిగా, అంకాళమ్మగా, ఉమాదేవిగా మూడు డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌లో కనిపించింది. మూడు క్యారెక్టర్లను బాగా పెర్‌ఫార్మ్‌ చేసింది. మిగతా క్యారెక్టర్లలో సినిమాలో ఎక్కువ భాగం కనిపించేది బ్యాంక్‌ మేనేజర్‌ క్యారెక్టర్‌. ఈ క్యారెక్టర్‌ మొదట్లో బాగానే వుంది అనిపించినా తర్వాత విసిగిస్తుంది. జె.పి. ఈ క్యారెక్టర్‌ని బాగా చెయ్యడానికి తనవంతు కృషి చేశాడు. మహేష్‌గా అజయ్‌ క్యారెక్టర్‌ చాలా రొటీన్‌గా వుంటుంది. ఇలాంటి క్యారెక్టర్స్‌ అజయ్‌ గతంలో చాలా చేసేసి వుండడం వల్ల మనకు కొత్తగా అనిపించదు. ఇక బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌బాబు ఎందుకూ పనికిరాని క్యారెక్టర్‌ చేశాడు. అది సినిమాకి ఎంత మాత్రం ఉపయోగం లేదు, అతనికీ టైమ్‌ వేస్ట్‌ అయ్యే క్యారెక్టర్‌ అది.

టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్‌:
ఈ సినిమాలో టెక్నికల్‌గా చెప్పుకోవడానికి ఏమీ లేదు. చాలా సాధారణమైన ఫోటోగ్రఫీ. ఎక్కడా ఎలాంటి జర్క్స్‌గానీ, హడావిడిగానీ లేకుండా మామూలుగా తీసిన సినిమా. ఎడిటింగ్‌ విషయానికి వస్తే కోటగిరి వెంకటేశ్వరరావు రెగ్యులర్‌గా చేసే సినిమాల్లా ఈ సినిమా ఎడిటింగ్‌ వుండదు. ప్రతి సీన్‌లోనూ ల్యాగ్‌ కనిపిస్తుంది. 1 గంట 50 నిముషాల సినిమా కూడా మనకు రెండున్నర గంటల సినిమాలా అనిపిస్తుందంటే సినిమా ఎంత స్లోగా రన్‌ అవుతుందో అర్థమవుతుంది. ఇక కీరవాణి మ్యూజిక్‌ గురించి చెప్పాలంటే ఈమధ్యకాలంలో అతను చేసిన వెరీ బ్యాడ్‌ ఆల్బమ్‌ ఇదే అని చెప్పొచ్చు. రీరికార్డింగ్‌ కూడా ఏదో టీవీ సీరియల్‌ చూస్తున్న భావన కలుగుతుంది తప్ప సినిమా అనే ఫీలింగ్‌ అస్సలు రాదు. డైరెక్టర్‌ జగదీష్‌ విషయానికి వస్తే అతను కథను ఎత్తుకున్న విధానం చూస్తే చాలా ఇంటెలిజెంట్‌గా కొత్త కాన్సెప్ట్‌ని ఎనుకున్నాడనిపిస్తుంది. తీరా సినిమా స్టార్ట్‌ అయిన పది నిముషాల్లోనే సినిమా తర్వాత ఎలా వుండబోతోందనే దానిపై ఒక క్లారిటీ వస్తుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌తో సెకండాఫ్‌లో ఏదో సెన్సేషన్‌ జరగబోతోంది అనే హింట్‌ ఇచ్చాడు డైరెక్టర్‌. కానీ, సెకండాఫ్‌ అంతా పనికిరాని చెత్తనంతా ఒకచోట చేర్చినట్టు ఒక దానివెంట మరో సీన్‌ వస్తుంటాయి, వెళ్తుంటాయి తప్ప కథ ముందుకు వెళ్ళదు. పది నిముషాలకు ఓ ట్విస్ట్‌ ఇవ్వడం వల్ల సినిమా హిట్‌ అయిపోతుందకున్నాడో ఏమోగానీ జగదీష్‌ ఇచ్చిన ట్విస్ట్‌లకు ఆడియన్స్‌ బుర్రలు వేడెక్కిపోయాయి.

విశ్లేషణ:
దేశంలో వున్న అన్‌ క్లైయిమ్డ్‌ ఎకౌంట్స్‌ కథాంశంతో సినిమా అనగానే చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చే ఆడియన్స్‌ ఈ సినిమా ప్రారంభంలోనే నిరాశపడక తప్పదు. ఫస్ట్‌ హాఫ్‌ ఎండింగ్‌లో 15 నిముషాలు మాత్రమే విషయం వుంటుంది. దానికి ముందు దేనికీ పనికిరాని సీన్స్‌తో సినిమా రన్‌ అవుతుంది. క్రైమ్‌ స్టోరీకి కొన్ని థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ జోడించి, అవి లాజిక్‌ ప్రకారమే జరిగాయని తర్వాత చెప్పి సెకండాఫ్‌ అంతా నడిపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్‌. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇవ్వడంతో తట్టుకోలేని ఆడియన్స్‌కి తలనొప్పి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే వున్నాయి. సెకండాఫ్‌లో సినిమా పైకి లేస్తుందని ఆశించే ఆడియన్స్‌ తామే లేచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని మాత్రం ఊహించరు. ఒక రొటీన్‌ క్లైమాక్స్‌తో సినిమాని ముగించేసి లెక్క సరిపెట్టుకున్నాడు డైరెక్టర్‌. ఫైనల్‌గా చెప్పాలంటే కథలోగానీ, కథనంలోగానీ, డైలాగ్స్‌లోగానీ, సీన్స్‌లోగానీ ఎలాంటి కొత్తదనం లేని ఈ సినిమాని చూసి ఆడియన్స్‌ ఎంటర్‌టైన్‌ అవ్వడం కంటే అసహనానికి లోనయ్యే అవకాశమే ఎక్కువగా వుంది.

తెలుగు360.కాం రేటింగ్‌: 1.25/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీ తల్చుకుంటే శ్రీవారి ఆస్తుల అమ్మకం నిలిపివేత ఎంత సేపు..!?

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు..శ్రీవారి ఆస్తులను అమ్మకానికి పెట్టిన విషయంపై బీజేపీ భగ్గమని లేస్తోంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు దీక్షలకు సిద్ధమయ్యారు..తెలంగాణ నేతలు కూడా.. ఊరుకునేది లేదని.. హెచ్చరికలు జారీ చేస్తున్నారు. స్వయంగా......

ఏడాదిలో 90 శాతం హామీలు అమలు చేశాం : జగన్

మద్యం రేట్లను పెంచడం ద్వారా మద్యం తాగే వారి సంఖ్య 24 శాతం మేర తగ్గిపోయిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తేల్చారు. పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా.. మన పాలన- మీ...

స్టూడియోల‌కు పూర్వ వైభ‌వం

జీవితం ఓ సైకిల్ చ‌క్రం లాంటిది. ఎక్క‌డ మొద‌లెట్టామో తిరిగి అక్క‌డికే వ‌చ్చి ఆగుతాం. సినిమాల ప‌రిస్థితి ఇప్పుడు అలానే మారింది. ఇది వ‌ర‌కూ సినిమా అంటే స్టూడియో వ్య‌వ‌హార‌మే. తొలి స‌న్నివేశం...

విమానాల వాయిదా : తొందరపడినా ప్రభుత్వం సిద్ధం కాలేకపోయిందా..?

దేశమంతా విమనాశ్రయాలు ఓపెన్ అయ్యాయి.. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం.. ఒక్క రోజు వాయిదా పడ్డాయి. కారణాలేమైనా కావొచ్చు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... లాక్ డౌన్ ఎత్తేసి.. సాధారణ కార్యకలాపాలు ప్రారంభించాలని.. లాక్‌డౌన్ 1.0 అయిపోయినప్పుడే...

HOT NEWS

[X] Close
[X] Close