భాజపా గెలిస్తేనే బాబు మాటకు వేల్యూ!

తెలుగుదేశం పార్టీ మీద నిర్ణయాల విషయంలో చంద్రబాబునాయుడు ఫైనల్‌. ఇందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహమూ లేదు. అయినంత మాత్రాన, ఆయన మాట తిరుగులేని ఆదేశంలాగా చెల్లుబాటు అయ్యే పరిస్థితి ఆ పార్టీలో ఉన్నదా? ఏపీలో ఆయన రాజ్యం చేస్తున్నారు గనుక, సీఎం పదవిలో ఉన్నారు గనుక.. ఆయన మాటకు పార్టీలో ప్రతి ఒక్కరూ విలువ ఇస్తూ ఉండవచ్చు. అదే తెలంగాణ విషయానికి వస్తే.. కార్యకర్తలు శ్రేణులు అధినేత మాటకు అంతే విలువ ఇచ్చే పరిస్థితి ఉన్నదా? ఈ విషయం కాస్త సందేహమే. అలాంటి సందేహాలే.. ఇప్పుడు గ్రేటర్‌ పరిధిలో బరిలో ఉన్న భాజపా నాయకులకు కూడా భయాన్ని పుట్టిస్తున్నాయి.

తెదేపా- భాజపా గ్రేటర్‌ పరిధిలో కలిసే పోటీచేస్తున్న సంగతి అందరికీ తెలుసు. నిజానికి తెదేపా చాలా బలంగా ఉండే కొన్ని డివిజన్లను కూడా భాజపాకు కేటాయించారు. అయితే.. ఇలాంటి చోట్ల తెదేపా సపోర్ట్‌ ఉంటే తప్ప కమలదళం గెలవడం కష్టం. కానీ అన్ని చోట్ల వారికి సమానంగా తెదేపా వారి మద్దతు లభించడం లేదు. అందుకే చంద్రబాబునాయుడు హైదరాబాదులో ఉన్న ఈ రెండు రోజుల్లోనే డివిజన్ల పార్టీ ఇన్చార్జుల టెలికాన్ఫరెన్స్‌ సమావేశం కూడా పెట్టుకుని.. భాజపా నాయకుల ప్రశంసలు పొందేలాగా తెదేపా శ్రేణులు పనిచేసి వారిని గెలిపించాలంటూ హితవు చెబుతున్నారు.
అయితే ఈ హితవాక్యాలను చెవికి ఎక్కించుకునేది ఎవరు? ఒకసారి తమ డివిజన్‌లో భాజపాను గెలిపిస్తే.. ఇక తమ రాజకీయ కెరీర్‌కు శాశ్వతంగా సీలింగ్‌ వేసుకోవడమే అనే భయం ప్రతిచోటా ప్రతి ఒక్కరికీ ఉంటుంది. మరి అలాంటి నేతలు చంద్రబాబు మాట ఖాతరు చేస్తారా? లోలోపల భాజపా వెనుకగోతులు తీయకుండా ఉంటారా? అనేది ఫలితాలు వచ్చాక గానీ తేలదు. ఇలాంటి సంక్లిష్ట సమయాల్లో పార్టీ శ్రేణులను జోకొట్టి వారితో సానుకూల దృక్పథంతో పనిచేయించడానికి అనుసరించాల్సిన వ్యూహాలు వేరు. కేవలం టెలికాన్ఫరెన్స్‌లో ఇవి తీరుతాయా అనేది విశ్లేషకుల అనుమానం. కనీసం నేరులో అయినా డివిజన్‌ ఇన్చార్జుల సమావేశం పెట్టి ఉంటే.. అందరూ తమ తమ గోడు అధినేతతో చెప్పుకుని, తమకు తగిన హామీలు పొంది.. ఆ నమ్మకంతో ప్రచారంలో చురుగ్గా ఉండే అవకాశం ఉండేది కదా అని పలువురు భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ వాతావరణ శాఖ

వేసవిలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న హైదరాబాద్ ప్రజలకు కాస్త ఊరట లభించింది. శనివారం ఉదయం నుంచి నగరంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రతి రోజూ వడగాడ్పులతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close