డోసు త‌గ్గించిన టైల‌రు గారు

ఫ్యాష‌న్ డిజైన‌ర్ స‌న్నాఫ్ లేడీస్ టైట‌ర్ ప్రీలుక్ పోస్ట‌ర్ చూసి గ‌య్‌… మ‌న్నారంతా. ఆ పోస్ట‌ర్ కాస్త టూమ‌చ్‌గా ఉన్న మాట వాస్త‌వ‌మే అయినా.. అవ‌స‌రానికి మించిన హ‌డావుడి చేశారు కొంత‌మంది. హీరోయిన్లంటే గౌర‌వం లేదా?  స‌భ్య స‌మాజం.. అంటూ పెద్ద పెద్ద డైలాగులు వాడేశారు. వాళ్ల పుణ్య‌న‌… అస‌లు ఉలుకూ ప‌లుకూ లేని ఈ టైట‌ర్ గారి అబ్బాయికి జ‌వ‌స‌త్వాలు అద్దాయి. అస‌లేమాత్రం ఖ‌ర్చు లేకుండా బోల్డంత ప‌బ్లిసిటీ వ‌చ్చిప‌డిపోయింది. ప్రీ లుక్కే అలా ఉంటే.. ఇక అస‌లు సిస‌లు ఫ‌స్ట్ లుక్ ఎలా ఉంటుందో అని కంగారు ప‌డ్డారంతా.  ప్రీ లుక్ తో దొరికిన ప‌బ్లిసిటీని ఎడా పెడా వాడేస్తూ.. ఇంకొంచెం డోసు పెంచేయ‌డం ఖాయం అనుకొన్నారు కూడా. కానీ అలాంటి ప్ర‌మాదాలేం జ‌ర‌గ‌లేదు.
ఈరోజు విడుద‌లైన ఫస్ట్ లుక్ కాస్త డీసెంట్‌గానే ఉంది. హీరోగారు, అమ్మాయి న‌డుం కొల‌త తీసుకొనే ప‌నిలో ఉంటే.. మిగిలిన హీరోయిన్లు ఆ చిత్రం చాలా ఆసక్తిగా గ‌మ‌నిస్తున్న పోస్ట‌ర్ ని విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. నిజంగా చెప్పాలంటే.. ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిన రెండు స్టిల్స్‌లో వంశీ మార్క్ ఏమాత్రం క‌నిపించ‌లేదు. ఆయ‌న ట్రెండ్ ని ఫాలో అయ్యే ప‌నిలో త‌న స్టైల్‌ని మ‌ర్చిపోతున్నాడేమో అనిపిస్తోంది. ప్రీ లుక్‌తోనే ర‌చ్చ జ‌రిగింది… ఇక దాన్ని కొన‌సాగించ‌డం ఇష్టంలేద‌న్న‌ట్టు.. ఈసారి లుక్‌లో డోస్ త‌గ్గించేశారు.  అన్న‌ట్టు.. ఫ్యాష‌న్ డిజైన‌ర్ షూటింగ్ పూర్త‌యిపోయింది. మేలో ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తారు. ఈలోగా వారానికి ఓ పాట‌ని విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. ప్రీ లుక్‌తో వ‌చ్చిన ప‌బ్లిసిటీని కాస్త వాడుకొంటే… ఈ సినిమాకి టికెట్లు తెగ‌డం ఖాయం. మ‌రి.. మునుముందు అలాంటి సిత్రాలేమైనా చేస్తారేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close