బీహార్ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ఆర్జేడీ అధినేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పెద్ద కుమారుడు , మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ను పార్టీ నుంచి , కుటుంబం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. బాధ్యతారహిత ప్రవర్తన, కుటుంబ విలువలకు విరుద్దంగా వ్యవహరించారని తేజ్ ప్రతాప్ ను పార్టీ నుంచి ఆరేళ్ల పార్టీ సస్పెండ్ చేస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
తేజ్ ప్రతాప్ యాదవ్ ఇటీవల తమ ప్రేమబంధాన్ని బహిర్గతం చేశాడు. 12 ఏళ్లుగా అనుష్క యాదవ్ తో ప్రేమలో ఉన్నట్లు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. అయితే , ఇదివరకే తేజ్ కు వివాహం అయింది. 2018లో బిహార్ మాజీ మంత్రి చంద్రికా రాయ్ కుమార్తె ఐశ్వర్య రాయ్‌తో పెళ్లి జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్లకే వీరు విడిపోయారు. ఆరేళ్లుగా వీరి విడాకుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.
వీరి విడాకుల కేసు ఇంకా ఎటు తేలకముందే ఆయన అనుష్క యాదవ్ తో ప్రేమ బంధాన్ని బహిరతం చేశాడు. లాలూ ప్రసాద్ తోపాటు కుటుంబ సభ్యులతో చర్చించకుండానేతేజ్ తన ప్రేమబంధాన్ని బహిర్గతం చేయడం పట్ల లాలూ ప్రసాద్ తండ్రి అసంతృప్తికి గురైనట్లుగా తెలుస్తోంది.
ఎన్నికల ముంగిట కొడుకు ఈ వ్యవహారం ఆర్జీడీని దెబ్బ తీసేందుకు ప్రత్యర్థులకు ఓ అస్త్రంలా మారనుంది. దీంతో భవిష్యత్ పరిణామాలను అంచనా వేసి పెద్దకొడుకు తేజ్ ప్రతాప్ ను పార్టీ , కుటుంబం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.