స్థిరాస్తి హక్కులపై 12 సంవత్సరాల లిమిటేషన్ ఉంటుందని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. లిమిటేషన్ చట్టం, 1963 ఆర్టికల్ 65 ప్రకారం, ఆస్తి హక్కు కలిగి ఉందన్న దావా (సూట్ ఫర్ పాసెషన్) 12 ఏళ్లలోపే దాఖలు చేయాలి. ఆస్తి ఇతరుల కలిగి ఉండటం (అడ్వర్స్ పాసెషన్) మొదలైన తేదీ నుంచి ఈ గడువు లెక్కిస్తారు. మౌనంగా 12 ఏళ్లు ఉండి.. ఆ తర్వాత కొత్త కారణాలతో పూర్వీకుల ఆస్తిపై హక్కు క్లెయిమ్ చేయలేరు అని తాజా కోర్టు తీర్పుతో స్పష్టమవుతోంది.
రంగారెడ్డి జిల్లా మహేశంలో ఉన్న 30 ఎకరాల ఆస్తి హక్కుల విషయంలో కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. 1967లో మొహమ్మద్ గౌస్ అలీఖాన్ కుటుంబం హైదరాబాద్కు వెళ్లిన తర్వాత ల్యాండ్ గ్రాబ్బర్లు రెవెన్యూ రికార్డులు మార్చి, తల్లి పేరు తొలగించారని వారసులు కోర్టులో పిటిషన్లు వేశారు. ముస్లిం లా హిబా ద్వారా హక్కు వచ్చిందని చెప్పారు. (కానీ పాసెషన్ ట్రాన్స్ఫర్ లేకపోవడంతో చట్టబద్ధం కాదు . 2013-2017 4 సేల్ డీడ్లు జరిగాయి. 2017లో 22nd సెంచురీ ఇన్ ఫ్రా కొనుగోలు చేసింది.
2020లో వారసులు సివిల్ కోర్టులో దావా వేశారు. సేల్ డీడ్లు క్యాన్సల్ చేసి, పాసెషన్ తిరిగి ఇవ్వాలని కోరారు. 50 ఏళ్లకు మౌనం తర్వాత కోర్టుకు వచ్చారు. విచారణ జరిపిన కోర్టు ఆస్తి ఇతరుల చేతిలోకి వెళ్లిన తేదీ నుంచి 12 ఏళ్లు మాత్రమే గడువు. సుప్రీం కోర్టు జడ్జ్మెంట్లు ఉదహరించారు. అదే సమయంలో వారు చెప్పిన హిబా చెల్లదని.. పాసెషన్ ట్రాన్స్ఫర్ లేకపోతే చెల్లదని కోర్టు తీర్పు చెప్పింది. ఇలాంటి దావాలు అసలు తీసుకోకూడదని కోర్టు అభిప్రాయపడింది.
