జగన్ “దేవుడి స్క్రిప్ట్” డైలాగ్ పై పంచ్ వేసిన లోకేష్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొదటి అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడుతూ, ఎన్నికలలో దేవుడు గొప్ప స్క్రిప్ట్ రాశాడని, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ సీపీ పార్టీ నుండి 23 మంది ఎమ్మెల్యేలను లాక్కుంటే, 2019 ఎన్నికలు వచ్చేసరికి అదే 23 మంది ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీకి దేవుడు మిగిల్చాడని, ఆ రకంగా దేవుడు రాసిన స్క్రిప్ట్ చాలా గొప్పదని జగన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

అయితే సరిగ్గా జగన్ పాలన నెల రోజులు పూర్తి చేసుకున్న సమయానికి, లోకేష్, జగన్ దేవుడి స్క్రిప్ట్ డైలాగు ని కేంద్రంగా చేసుకొని సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు. దేవుడు స్క్రిప్ట్ లో కేవలం కామా పెట్టాడని మీరు దాన్ని ఫుల్స్టాప్ అనుకొని గుడిని గుడిలో లింగాన్ని మింగేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యలు చేసాడు లోకేష్. పట్టి సీమ, పోల వరం, అమరావతి, విద్యుత్తు ఒప్పందాలు – ఈ నాలుగు అంశాల్లోనూ, ప్రతిపక్షంలో ఉన్నప్పటి జగన్ వైఖరికి, అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ వైఖరికి తేడాలు చూపుతూ లోకేష్ చేసిన ట్వీట్ కు మంచి స్పందన వస్తోంది.

లోకేష్ ట్వీట్ చేస్తూ, ” దేవుడి స్క్రిప్ట్ లో ట్విస్ట్‌లూ ఉంటాయి జ‌గ‌న్ గారూ! దేవుడు స్క్రిప్ట్ రాస్తూ పూర్తిగా ముగించ‌లేదు. రాస్తూ, రాస్తూ కామా పెట్టాడంతే! అది ఫుల్‌స్టాప్ అనుకున్నారు మీరు. ఈ గ్యాప్‌లోనే మీరు గుడినీ, గుడిలో లింగాన్ని మింగేయాల‌నుకుంటున్నారు. దేవుడు కామా త‌రువాత మ‌ళ్లీ స్క్రిప్ట్ రాయ‌డం మొద‌లు పెట్టాడు. మీరు అవినీతి అన్న ప‌ట్టిసీమ మోటార్లు మీతోనే ఆన్ చేయించాడు. అడ్డ‌గోల‌న్న పోల‌వ‌రం అంచ‌నాలను య‌థా త‌థంగా కేంద్రంతో ఓకే చేయించాడు. భ్ర‌మ‌రావ‌తి అన్న మీ భ్ర‌మ‌లు తొల‌గించుకునేందుకు దేవుడే ఓ ఛాన్సిచ్చాడు. సెక్ర‌టేరియ‌ట్‌లో సీఎం సీటులో కూర్చున్న‌ప్పుడైనా, అసెంబ్లీలో అడుగు పెట్టిన‌ప్పుడైనా చంద్ర‌ బాబు గారికి మ‌న‌సులో కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకో అని స్క్రిప్ట్ లో మ‌ళ్లీ కామా పెట్టాడు. టీడీపీ హ‌యాంలో విద్యుత్ కొనుగోళ్లు అక్రమం అని మీరంటే… అవి ముట్టుకుంటే షాక్ కొడ‌తాయ‌ని కేంద్రంతో లేఖ రాయించాడు. దేవుడి స్కిప్ట్ లో ఇటువంటి కామాలు చాలానే ఉంటాయి.” అని రాసుకొచ్చారు. వీటితోపాటు గతంలో పట్టిసీమ ని వ్యతిరేకిస్తూ, పలుమార్లు పలు వ్యాఖ్యలు చేసిన జగన్, ఇప్పుడు అదే పట్టిసీమ కు నీళ్ళు వదిలిన విషయాన్ని గుర్తు చేస్తూ, జగన్ అప్పట్లో చేసిన వ్యాఖ్యల వీడియోలను సైతం పొందుపరుస్తూ, మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్ ఇప్పుడేమంటారు అంటూ సెటైరికల్ పోస్ట్ చేశారు లోకేష్.

లోకేష్ వేసిన పంచ్ లకు వైఎస్ఆర్ సిపి నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close