జగన్ రేపే హోదా మంటలను ముందే ఆర్పేయాలనుకుంటున్న బీజేపీ..!

వలసలతో బలపడాలని ఏపీ బీజేపీ నిర్ణయించుకుంది. రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయటంతోపాటు రానున్న ఎన్నికల నాటికి ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహారించాలనే రెండంచెల వ్యూహంతో ముందుకు సాగాలని కమలనాథులు నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం బలం కోల్పోవడంతో ఆ స్థానంలోకి బీజేపీని తీసుకొచ్చేందుకు వ్యూహాలు రూపొందించాలని నిర్ణయించారు. భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశం హాయ్ ల్యాండ్‌లోని ఓ విల్లాలో జరుగుతోంది. ఆదివారం జరగబోయే సమావేశానికి పార్టీ కీలక నేత రాంమాధవ్ కూడా హాజరుకానున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలీయమైన శక్తిగా ఎదగడంతోపాటు దక్షిణాదిలో కూడా బీజేపీ ఉనికిని నిరూపించుకునే విధంగా ప్రయత్నాలు ప్రారంభించాలని తొలి రోజు నిర్ణయించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీకున్న క్రేజ్ ను పార్టీకి అనుకూలంగా ఉపయోగించుకోవాలని కూడా నేతలు నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో సంస్థాగతంగా ఎదిగేందుకు వలసలను ప్రోత్సహించడం అనే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. తెలుగుదేశం పార్టీతోపాటు కాంగ్రెస్, జనసేన నుంచి వచ్చే నేతలను కూడా ఆహ్వానించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన నలుగురు ఎంపీల ద్వారా మరికొంతమంది తెలుగుదేశం నేతలను రాష్ట్రంలో సంప్రదించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీజేపీ నేతలు కూడా కొంతమంది నేరుగా తెలుగుదేశం నేతలతో టచ్ లోకి వెళ్లారు. తెలుగుదేశం నేతలు మాత్రం కొంతమంది బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నప్పటికీ, మరికొంతమంది వేచిచూద్దామనే ధోరణిలో ఉన్నారని సమావేశంలో కొంతమంది నేతలు చెప్పినట్టు తెలిసింది. అయితే పార్టీలో చేర్చుకునే వారి వివరాలను హైకమాండ్ ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటుందని, పార్టీలో చేరే వ్యవహారాలను ఢిల్లీ స్థాయిలోనే పర్యవేక్షిస్తున్నారని సమావేశంలో అగ్రనేతలు వివరించారు.

మోడీ క్రేజ్ కూడా ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఓటింగ్ శాతం పూర్తిగా తగ్గిపోవడం వెనుక చంద్రబాబు చేసిన నెగిటివ్ ప్రచారమే కారణమని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై కొద్దిసేపు చర్చ జరిగింది. ప్రత్యేక హోదా సాధ్యంకాదనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలని బీజేపీ నేతలు భావించారు. దీన్ని సెంటిమెంట్ గా మార్చబోయే ముందే మేల్కోవాలని వారు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, సునీల్ ధియోదర్ లు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని, ప్యాకేజ్ ని తీసుకోవాలని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ ఒరవడే కొనసాగించాలనుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close